వంకాయతో ఈ కాంబినేషన్ అదుర్స్.. !!

Suma Kallamadi
వంకాయతో ఏ కూర చేసినాగాని ఆహా అని అనాల్సిందే.ఎందుకంటే వంకాయకి ఉన్న టేస్ట్ అలాంటిది మరి.తాజా కూరల్లో రాజా ఎవరంటే వంకాయ అని చాలా మంది అంటారు. లేత వంకాయలలో ఉత్తినే ఉప్పు కారం వేసి ఉడకబెట్టినా రుచిగానే ఉంటుంది. అయితే వంకాయ కూరని ఎప్పుడు వండేలాగా కాకుండా ఈసారి కాస్త వెరైటీగా వంకాయ మెంతి కూర వేపుడు ట్రై చేసి చూడండి.చాలా రుచిగా ఉంటుంది.

కావాల్సిన పదార్ధాలు:

1/2 kg లేత పొడవు వంకాయలు

150 gms మెంతి కూర (3 కట్టలు )

4 tbsps నూనె

1 tsp ఆవాలు

1 tsp జీలకర్ర

ఇంగువ చిటికెడు

1 tsp అల్లం తరుగు

1 tbsp వెల్లూలి

1 cup ఉల్లిపాయ తరుగు

2 టొమాటో

2 పచ్చిమిర్చి తరుగు

1/2 tsp పసుపు

1 tsp ధనియాల పొడి

ఉప్పు

1 tbsp కారం

తయారీ విధానం :

ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టి నూనె వేడి చేసి అందులో  2 అంగుళాల సైజు వరకు కోసుకున్న వంకాయ ముక్కలు వేసి రంగు మారి,  80% వంకాయ ముక్కలు మగ్గేదాకా వేపుకోవాలి. తరువాత వేపుకున్న వంకాయ ముక్కలని పక్కకు తీసుకోవాలి .ఇప్పుడు అదే నూనె లో ఆవాలు, జీలకర్ర, ఇంగువా, అల్లం వెల్లూలీ తరుగు వేసి వేపుకోవాలి. అవి వేగిన తరువాత సన్నగా తరుగుకున్న ఉల్లిపాయల్ని వేయాలి. ఉల్లిపాయ మెత్తబడేదాకా వేపి, టొమాటో, పచ్చిమిర్చి తరుగు వేయాలి. టొమాటో గుజ్జుగా అయ్యేదాకా వేపుకోవాలి. ఆ తరువాత పసుపు, ధనియాల పొడి,ఉప్పు,కారం వేసి వేపుకోవాలి.ఒక రెండు నిముషాలు వేగిన తరువాత సన్నగా కోసుకున్న మెంతి కూర తరుగు వేయాలి. ఆకు మగ్గి నూనె పైకి తేలే దాకా వేపుకోవాలి .ఆకు వేగిన తరువాత వేపుకున్న వంకాయ ముక్కలు వేసి మరో 3 నిమిషాలు వేపి దింపేసుకోవాలి. అంతే వంకాయ మెంతికూర రెడీ అయినట్లే.అన్నం, చపాతీల్లోకి చాలా ఈ కూర చాలా రుచిగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: