ఈ పండగను చెక్కెర పొంగలితో మరింత రెట్టింపు చేసుకోండి.. !!

Suma Kallamadi
ఈ ఉగాది పండగ రోజు మీ నోరు తీపి చేయడానికి  ఘుమఘుమలాడే చక్ర పొంగలి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాము. అసలు తీపి అంటే ముందుగా మనకు గుర్తొచ్చే వంటకం ఏదన్నా ఉంది అంటే అది చక్కెర పొంగలి ఒక్కటే.మరి ఎంతో టేస్టీగా ఉండే చక్కెర పొంగలి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
కావాలసిన పదార్దాలు:
బియ్యం -1 కప్పు,
పెసరపప్పు -1/2 కప్పు
బెల్లం – 1/2 కప్పు
నీళ్లు -4 గ్లాసులు
నెయ్యి -1/4కప్పు
జీడిపప్పు-10
కిస్మిస్-8
కొబ్బరి ముక్కలు-6
యాలకుల పొడి-1/4 టీస్పూన్
పచ్చ కర్పూరం పొడి -చిటికెడు
జాజికాయ పొడి -చిటికెడు,
తయారీ విధానం:
ముందుగా స్టవ్ వెలిగించి దాని మీద ఒక  ప్యాన్ పెట్టి అందులో ఒక స్పూన్ నెయ్యి వేసి పెసర పప్పును దోరగా వేయించుకోవాలి. తరువాత దీనిలో బియ్యం కూడా వేసి సరిపడా నీళ్లు పోసి కుక్కర్ లో నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. తరువాత ఒక ప్యాన్ లో బెల్లం వేసి కొద్దిగా నీళ్లు పోసి చిన్న మంటపై ఉడికించాలి. బెల్లం పాకం చుక్కను గ్లాసు నీటిలో వేస్తే కరగకుండా అడుగుభాగానికి చేరుకున్నట్లయితే పాకం తయారైనట్టు.ఇప్పుడు ఈ పాకంలో ముందుగా  ఉడికించి పెట్టుకున్న బియ్యం, పెసరపప్పు మిశ్రమాన్ని వేసి కలిపి చిన్న మంటపై ఐదు నిమిషాలు ఉడికించాలి. ఇప్పుడు నెయ్యి వేసి మరికాసేపు ఉడికించాలి. వీటిలో యాలకుల పొడి, పచ్చ కర్పూరం పొడి, జాజికాయ పొడి వేయాలి. తరువాత ఒక బాండీలో కొద్దిగా నెయ్యి వేసుకుని సన్నగా తరిగిన కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, కిస్మిస్ వేసి ఎర్రగా వేయించి పొంగలిలో కలుపుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన చక్కెర పొంగలి రెడీ..ఈ రెసిపీకి సరిపడా నెయ్యి ఉంటేనే రుచి బాగుంటుంది.. మరి ఇంకెందుకు ఆలస్యం త్వరగా ఈ పండగకి ఈ తీపి రెసిపీని చేసి మీ ఇంట్లో అందరి నోళ్లను తీపి చేసేయండి మరి.. !!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: