సగ్గుబియ్యం కిచిడి ఎలా తయారు చేయాలో తెలుసుకోండి.. !!
కావలసిన పదార్థాలు::
సగ్గుబియ్యం- ఒక కప్పు
నెయ్యి -ఒక టేబుల్ స్పూన్
ఆవాలు -అర టీ స్పూన్
పచ్చిమిర్చి -రెండు
కరివేపాకు -ఐదు ఆకులు
బంగాళదుంప -1
ఉప్పు -తగినంత
మిరియాల పొడి -అర టీ స్పూన్
పంచదార -1 స్పూన్
కొత్తిమీర తరుగు -1 స్పూన్
టమాటా -1
వేయించిన వేరుశెనగ గింజలు పొడి- అర కప్పు
ఆయిల్ -సరిపడినంత
తయారీ విధానం:
ముందుగా ఒక కప్పు సగ్గుబియ్యంని తీసుకుని ఒక గిన్నెలో వేసి బాగా కడిగి రెండు గంటలు పాటు నాన బెట్టుకోవాలి.రెండు గంటల తర్వాత వీటిని తీసి ఇంకొక సారి కడిగి స్టెనర్ సహాయంతో నీళ్లను మొత్తం వడకట్టుకోవాలి.తర్వాత సగ్గుబియ్యాన్ని తీసి ఏదైనా ఒక కాటన్ క్లాత్ మీద తడి పోయేవరకు ఆరబెట్టుకోవాలి. దాన్ని అలాగే ఉంచి తర్వాత పొయ్యి వెలిగించి ఒక బాండీ పెట్టి దానిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి నూనె కాగిన తరువాత దానిలో అర టీస్పూన్ ఆవాలు రెండు పచ్చి మిరపకాయలు, ఆరు కరివేపాకు ఆకులు వేసి కలుపుకోవాలి.అవి లైట్ గా వేగిన తర్వాత దానిలో బంగాళదుంప ముక్కలను మరియు టమాటా ముక్కలను వేసి వేయించుకోవాలి.అన్నీ బాగా వేగిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు ఒక టీ స్పూన్ కొత్తిమీర తరుగు, అర టీ స్పూన్ మిరియాల పొడి వేసి పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి .తర్వాత స్టౌ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి.తర్వాత ఇందాక తయారుచేసుకున్న సగ్గుబియ్యం అందులో వేసి ఒకసారి తిప్పాలి. దానిలో అర కప్పు వేయించిన పల్లీలు పొడి వేసుకొని బాగా కలుపుకుని, చుట్టూ ఒక టీ స్పూన్ నెయ్యి రాసిన గిన్నెలో పొయ్యాలి. తర్వాత ఇడ్లీ పాత్రను తీసుకుని స్టౌ పై పెట్టి దానిలో అడుగుభాగాన కొంచెం నీళ్ళు పోసి దానిలో ఒక స్టాండ్ పెట్టి, ఆ స్టాండ్ పైన ఇందాక తయారు చేసుకున్న సగ్గుబియ్యం మిశ్రమాన్ని పెట్టాలి. తర్వాత దానిపై మూతపెట్టాలి ఇలా పది నిమిషాలు ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి.అంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన సగ్గుబియ్యం కిచిడి రెడీ.