రుచికరమైన ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా చెయ్యాలో తెలుసుకోండి...
కావల్సిన పదార్థాలు:
బంగాళదుంపలు: 4 స్లైస్ గా కట్ చేసుకోవాలి చీజ్ తురుము: 2tbsp
థైమ్: 1tbsp
సీసాల్ట్: 1tsp
కారం: 1/2tsp
జీలకర్ర: 1/4tsp
బ్లాక్ పెప్పర్ పౌడర్: 1tsp
ఆలివ్ ఆయిల్: 2tbsp
వెనిగర్: 1tbsp
ఫ్రెంచ్ ఫ్రైస్ తయారు చేసే విధానం....
ముందుగా బంగాళదుంపలను ఫ్రెంచ్ ఫ్రైస్ లా కట్ చేసుకోవాలి.ఫ్రెంచ్ ఫ్రైస్ స్లైస్ లా కట్ చేసుకొన్న బంగాళదుంప ముక్కలను చల్లటి నీళ్ళలో వేసి, అందులో ఒక చెంచా వెనిగర్ వేయాలి. ఈ వెనిగర్ నీటిలో 30నిముషాలు నానబెట్టాలి. తర్వాత నీళ్ళ నుండి బయటకు తీసేసి వాటి వేరే నీళ్లు పోసి శుభ్రం చేయాలి. తర్వాత సాప్ట్ కాటన్ క్లాత్ తీసుకొని శుభ్రంగా తుడిచేయాలి. ఇలా చేయడం వల్ల తడి మొత్తం ఆరిపోతుంది.తర్వాత మైక్రోవోవెన్ ను 200డిగ్రీల సెల్సియస్ లో వేడి చేయాలి.అందులో జీలకర్ర, ఉప్పు, ఆలివ్ ఆయిల్, చీజ్, పచ్చిమిర్చి, మిరయు పెప్పర్ ను ఫ్రెంచ్ ఫ్రైస్ మీద చిలకరించి మైక్రోవోవెన్ లో పెట్టాలి.తర్వాత వాటిని ఓవెన్ ట్రే మీద పడకుండా వాటిని సున్నితంగా కలియబెట్టాలి.కలియబెడుతూనే 25నిముషాలు టోస్ చేస్తూ బేక్ చేయాలి. ఇలా ఫ్రై చేసుకొన్నఫ్రెంచ్ ఫ్రైస్ ను బయటకు తీసి 5నిముషాలు పక్కన పెట్టుకోవాలి.తర్వాత తిరిగి ఓవెన్ ను 250 డిగ్రీల్లో పెట్టి, ఫ్రెంచ్ ఫ్రైస్ ను తిరిగి లోపల పెట్టాలి. మరో 5నిముషాలు ఫ్రెంచ్ ఫ్రైస్ ను ఫ్రై చేయాలి . అవి క్రిస్పీగా మూలల్లో మరియు చివర్లలో ముదురుబ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత వాటి బయటకు తీసి, వాటి మీద కొద్దిగా ఉప్పు, థైమ్, జీలకర్ర, మరియు పెప్పర్ చిలకరించాలి . అంతే వేడి వేడి స్నాక్ ను టమోటో సాస్ తో ఇప్తార్ కు సర్వ్ చేయండి.ఇంకెందుకు ఆలస్యం ఈ రుచికరమైన ఫ్రెంచ్ ఫ్రైస్ మీరు ట్రై చెయ్యండి...