స్పైసీ చిల్లి పన్నీర్ ఎలా తయారు చెయ్యాలో తెలుసుకోండి....

Purushottham Vinay

ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. పన్నీర్ అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. ఎంతో రుచికరంగా ఉంటుంది. ఇక రుచికరమైన టేస్టీ స్పైసీ చిల్లీ పన్నీర్ ని ఎలా తయారు చెయ్యాలో ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి....

చిల్లి పన్నీర్ కి కావాల్సిన పదార్ధాలు...

పన్నీర్ - అరకిలో, కోడి గుడ్డు - ఒకటి, కార్న్ ఫ్లోర్ - అరకప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక టీస్పూను, అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక టీస్పూను, ఉల్లి తురుము - రెండు కప్పుడు, పచ్చిమిర్చి తురుము - ఒక టీస్పూను, సోయాసాస్ - ఒక టీస్పూను, వెనిగర్ - రెండు టీస్పూనులు, కొత్తి మీర తురుము - ఒక టేబుల్ స్పూను, అజినమోటో - పావు టీస్పూను, నూనె - సరిపడినంత, ఉప్పు - తగినంత

చిల్లి పన్నీర్ తయారు చేసే విధానం...

పన్నీర్‌ను మీకు తినడానికి వీలయ్యే సైజులో ముక్కలుగా కోసుకోవాలి. ఒక గిన్నెలో పన్నీర్ ముక్కలు వేసి, అందులో కోడిగుడ్డు సొన, కార్న్‌ఫ్లోర్, అల్లం వెల్లుల్లి పేస్టు, కాస్త నీళ్లు వేసి కలపాలి. ఓ అరగంట పాటూ అలా వదిలేయాలి. అనంతరం కళాయిలో నీళ్లు వేసి నూనె వేయాలి. నూనె వేడెక్కాక పన్నీర్ ముక్కల్ని బ్రౌన్ రంగులోకి వచ్చేలా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో కళాయిలో రెండు టీ స్పూనుల నూనె వేసి అది వేడెక్కాక ఉల్లి తురుము, పచ్చి మిర్చి తురుము వేసి వేయించాలి. అందులోనే సోయాసాస్, వెనిగర్, అజినమోటో వేసి కలపాలి. అందులో ముందుగా వేయించిన పన్నీర్ ముక్కలు, ఉప్పు వేసి బాగా కలపాలి. స్టవ్ కట్టేసి పన్నీర్ ముక్కలపై కాస్త కొత్తి మీర చల్లుకుంటే సరిపోతుంది.ఇక ఇలాంటి మరెన్నో రుచికరమైన వంటకాల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో రుచికరమైన వంటాకాలు ఎలా చెయ్యాలో తెలుసుకోండి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: