రుచికరమైన వేగన్ కాజూ ఎలా చెయ్యాలో తెలుసుకోండి...

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...వేగన్ కాజూ చాలా రుచికరమైన స్వీట్. ఇది చాలా తియ్యగా ఉంటుంది. ఇంకా ఈ చలికాలంలో ఈ స్వీట్ చాలా బాగుంటుంది. ఇది అన్ని స్వీట్ల కంటే కూడా చాలా డిఫరెంట్ దీనిలో అనేక రకాల ప్రోటీన్స్ విటమిన్స్ సమృద్ధిగా ఉంటాయి. రోజు ఈ స్వీట్ తీసుకోవడం వలన చాలా పుష్టిగా బలంగా ఉంటారు. చిన్న పిల్లలు తమకు చాక్లెట్ కావాలని చాలా మారం చేస్తుంటారు. కాని పిల్లలకి ఆ చాక్లెట్ బదులు ఈ స్వీట్ తినిపిస్తే చాలా మంచిది. ఒక పక్క మంచి రుచితో పాటు మంచి బలాన్ని కూడా ఈ స్వీట్ ఇస్తుంది. మరి ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ లో ఈ వేగన్ కాజూ ని ఎలా చెయ్యాలో తెలుసుకొండి.. మీరు ఇంట్లో ట్రై చెయ్యండి. తప్పకుండా ఇది మీకు మీ పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది.

ఈ రుచికరమైన స్వీట్ తయారీకి కావాల్సిన పదార్ధాలు.....

అర కప్పు పంచదార....
పావు కప్పు నీరు....
అర టీ స్పూన్ ఏలకుల గింజల పొడి...
చిటికెడు కుంకుమ పువ్వు...
అర టీ స్పూన్ వాల్నట్ ఆయిల్...

జీడి పప్పు ఒక కప్పు, కాఫీ బ్లెండర్ లో ఒక టీస్పూన్ కార్న్ స్టార్చ్ వేసి ఈ జీడి పప్పులని పౌడర్ చేయాలి. ఈ పౌడర్ లో జీడి పప్పు పలుకులు లేకుండా చూసుకోవాలి.

రుచికరమైన వేగన్ కాజూ తయారు చేయు విధానం...

ఒక ప్యాన్ లో నీరు, పంచదార కలిపి ఒక్క పొంగు రానివ్వండి.ఇప్పుడు సిమ్ లో పెట్టి ఏలకుల పొడి, కుంకుమ పువ్వు కలిపి ఐదు నిమిషాలు ఉడికించండి.తీగ పాకం రాగానే స్టవ్ ఆఫ్ చేసి ప్యాన్ స్టవ్ మీద నుండి తీసేయండి.ఒక నాన్ స్టిక్ ప్యాన్ ని లో హీట్ మీద వేడి చేయండి.ఇందులో జీడి పప్పు పొడి వేసి కొద్దిగా వెచ్చబెట్టండి.ఇందులోనే పంచదార పాకం వేసి స్టవ్ మీద నుండి దింపేసి బాగా కలపండి.ఈ మిశ్రమం  దగ్గర పడడం మొదలయ్యాక ఒక క్లీన్ సర్ఫేస్ మీదకి కి ఈ మిశ్రమాన్ని ట్రాన్స్ఫర్ చేయండి.అర చేతులకి కొద్దిగా వాల్నట్ ఆయిల్ రాస్కుని ఈ పేస్ట్ ని బాగా కలపండి, అప్పుడే పేస్ట్ స్మూత్ గా వస్తుంది.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన పళ్ళెంలోకి తీసుకుని పళ్ళెం అంతా సమానంగా వచ్చేలాగా పరవండి.పూర్తిగా చల్లారే వరకూ పక్కన ఉంచేసి ఆ తరువాత డైమండ్ షేప్ లో కట్ చేయండి.  రుచికరమైన తియ్యని వేగన్ కాజూ తయారయినట్లే..ఇలాంటి మరెన్నో రుచికరమైన వంటకాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి....

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: