రుచికరమైన వేగన్ కుకీస్ ఎలా తయారుచేయాలో తెలుసుకోండి...

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ కుకింగ్ ఆర్టికల్ చదవండి.. సాధారణంగా ఇంట్లో పిల్లలకు కాని పెద్దలకు కాని స్నాక్స్ చేసుకుంటాం. ఆ స్నాక్స్ కోసం రక రకాల కొత్త కొత్త ఐటమ్స్ తయారు చేస్తూ ఉంటాము. ఆ ఐటమ్స్ లలో చాలా ఈజీగా, టేస్టీగా వుండేవి తయారు చేసుకోవాలనుకుంటున్నారా. అయితే వేగన్ కుకీస్ ఒకసారి ట్రై చెయ్యండి. మీకు కొబ్బరి అంటే ఇష్టమైతే కనుక ఈ కుకీస్ మీకు బాగా నచ్చుతాయి. అర్ధరాత్రి ఆకలేసినా, సోమవారం పొద్దున్నే ఆఫిసుకి వెళ్ళాలంటే బద్ధకమేసినా మీకు కావాల్సింది ఈ త్రీ ఇన్‌గ్రీడియెంట్ కుకీసే. అసలు ఈ కుకీస్ ఎంత రుచిగా ఉంటాయంటే జార్ నిండుగా ఇవి ఉన్నాయంటే వచ్చే ఆనందమే వేరు. ఇంకెందుకు ఆలస్యం ఈ రుచికరమైన వేగన్ కుకీస్ ఎలా తయారు చేయాలో తెలుసుకోండి మరి.
రుచికరమైన వేగన్ కుకీస్ తయారు చేయు విధానం... .
వేగన్ కుకీస్ చేయడానికి మీకు కావాల్సిన పదార్ధాలు...
2 కప్పులు - రోల్డ్ ఓట్స్...
2 కప్పులు - తురిమిన కొబ్బరి....
2 - పండిన అరటి పండ్లు.....

నోరూరించే వేగన్ కుకీస్ తయారు చేయు విధానం చూడండి...
ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఓట్స్, కొబ్బరి తురుము వేసి బరక గా పొడి కొట్టండి...
 
ఇప్పుడు ఇందులో పండిన అరటి పండ్లని కలపండి. ఇందువల్ల కుకీస్ కి నాచురల్ గా తియ్యదనం వస్తుంది.
మీ దగ్గర చిన్న బ్లెండర్ ఉంటే కలిపేముందు అరటి పండ్లని మాష్ చేయండి.
థిక్ వైట్ పేస్ట్ వచ్చే వరకూ వీటిని కలపండి.
ఇప్పుడు ఒక బేకింగ్ ట్రే తీసుకుని అందులో పార్చ్మెంట్ షీట్ పరవండి.
ఈ షీట్ మీద ఈ మిశ్రమాన్ని ఒక స్పూన్ చొప్పున ఉంచండి.
160 డిగ్రీల సెల్సియస్ వద్ద ఒవెన్ లో ఇరవై నిమిషాల పాటూ బేక్ చేయండి. బాగా క్రిస్పీగా, క్రంచీగా కావాలనుకుంటే ముప్పహి నిమిషాల పాటూ బేక్ చేయండి.
మీకు కావాలనుకుంటే కొన్ని చాక్లేట్ చిప్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మేపుల్ సిరప్ తో ఎంజాయ్ చేయండి.
ఈ రుచికరమైన కుకీస్ ట్రై చెయ్యండి. కచ్చితంగా మీ ఇంట్లో పిల్లలకు పెద్దలకు బాగా నచ్చుతాయి.
ఇలాంటి మరెన్నో కుకింగ్ రెసిపీస్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: