హెరాల్డ్ స్పెషల్ కర్రీ : ఎంతో టేస్టీగా ఉండే బోన్ లెస్ చికెన్ రెసిపీ మీకోసం.. !!

Suma Kallamadi
మాంసాహర వంటల్లో చాలామంది ఇష్టంగా తినేది చికెన్. అలాగే చికెన్ తో చేసే వంటకాలు ఏవయినా గాని  నోరూరిస్తాయి. ఎందుకంటే చికెన్ లో ఉండే అద్భుతమైన రుచి, ఘుమఘుమల వాసన వల్ల అందరూ ఇష్టంగా తింటారు. అందుకే ప్రపంచ వ్యాప్తంగా చికెన్ వంటలకు చాలా ప్రసిద్ది. అయితే ఎప్పుడు వండేలాగా కాకుండా ఈసారి కాస్త వెరైటీ గా తయారుచేద్దాం..  మరి ఆలస్యం చేయకుండా ఆ టేస్టీ అండ్ టెంప్టింగ్ చికెన్ రెసిపీని ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం..
కావల్సిన పదార్థాలు :
బోన్ లెస్ చికెన్ - 350 grams
కార్న్ ఫ్లోర్ - ½ cup
గుడ్డు - 1
వెల్లుల్లి పేస్ట్ - ½ tsp
అల్లం పేస్ట్ - ½ tsp
నూనె - డీప్ ఫ్రై చేయడానికి సరిపడా
ఉప్పు -రుచికి సరిపడా
ఉల్లిపాయలు - cups (సన్నగా తరిగిపెట్టుకోవాలి)
సోయా సాస్ - 1 tbsp
పచ్చిమిర్చి - 2
వెనిగర్ - 2 tbsp
నీళ్ళు : సరిపడా
కారం - కొంచెం
 
కొత్తిమీర -కొంచెం
తయారుచేయు విధానం :
ముందుగా చికెన్ ను శుభ్రంగా నీటితో కడిగి చిన్న చిన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని  అందులో కోడిగుడ్డు వేసి బాగా గిలకొట్టాలి తర్వాత కార్న్ ఫ్లోర్ , అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కొంచెం కారం , నీళ్ళు పోసి, చిక్కగా..జారుడుగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో   శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసి బాగా కలిపి  ఒక గంట పాటు పక్కన  పెట్టుకోవాలి. తర్వాత డీప్ కడాయ్ స్టౌమీద ఉంచి, అందులో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత కార్న్ ఫ్లోర్ మిశ్రమంలో మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేయాలి. డీప్ ఫ్రై చేసిన వాటిని టిష్యు పేపర్ మీద వేయడం వల్ల అదనపు నూనెను పీల్చుకుంటుంది.

ఇలా మ్యారినేట్ చేసిన చికెన్ మొత్తం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మరో పాన్ ను స్టౌ మీద పెట్టి అందులో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. అందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో సోయా సాస్, వెనిగర్, ఫ్రైడ్ చికెన్ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. దీన్ని గ్రేవీలాగా కావాలనుకుంటే మీరు కొద్దిగా నీళ్ళు కూడా కలుపుకోవచ్చు. తరువాత కొత్తిమీరతో గార్నిష్ చేయండి. అంతే సర్వ్ చేయడానికి బోన్ లెస్ చికెన్ రెసిపీ రెడీ. ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే వండేయండి. మీ పిల్లలు అయితే భలే ఇష్టంగా తింటారు.. !!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: