నోరూరించే వెల్లుల్లి పచ్చడి ఎలా చెయ్యాలో తెలుసుకోండి...!!!

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ కుకింగ్ ఆర్టికల్ మీ కోసం చదవండి.... వెల్లుల్లి ఊరగాయ నే లహసూన్ క ఆచార్ అని కూడా పిలుస్తునారు.ఇందులో కారం, ఉప్పు మరియు పులుపు రుచులని కలిగివున్నది ఈ రెసిపీ ని చాల సులువుగా తయారు చేసుకోవచ్చు. ఊరగాయ అంటే బాగా ఇష్టపడే వారికీ ఈ రెసిపీ బాగా నచ్చుతుంది. ఈ మసాలలో వచ్చే వాసన రెసిపికి మంచి తాజాదనాన్ని మరియు రుచిని అందిస్తుంది. మీరు మీ ప్రియమైన వారి కోసం ఈ సులువైన రెసిపీ ని కచ్చితంగా తయారు చేసి పెట్టండి.
వెల్లుల్లి ఊరగాయ తయారు చెయ్యడానికి కావాల్సిన పదార్ధాలు....
ప్రధాన పదార్థం....
1 కప్ వెల్లుల్లి......
4 టేబుల్ స్పూన్ ఆవ నూనె....
1 టీ స్పూన్ మెంతులు....
ప్రధాన వంటకానికి.....
2 టీ స్పూన్ లెమన్ జ్యూస్....
అవసరాన్ని బట్టి వెనిగర్.....
అవసరాన్ని బట్టి మిరపపొడి.....
అవసరాన్ని బట్టి ఉప్పు.....
1 టీ స్పూన్ ఆవాల విత్తనాలు....
1 టీ స్పూన్ సోపు.....
1/4 టీ స్పూన్ పసుపు......
1 టీ స్పూన్ నల్ల జీలకర్ర.....
వెల్లుల్లి ఊరగాయ తయారు చేయు విధానం చూడండి.....
వెల్లుల్లి పాయలు పెద్దవి అయితే వాటిని చిన్నగా కోసి పెట్టుకోండి.
కడాయి తీసుకోని అందులో ఆవాల గింజలను వేసుకొని పొడిగా వేయించండి, ఇప్పుడు సోంపు మరియు మెంతులు వేసుకొని తక్కువ మంటమీద 2 -3 నిముషాలు కలుపుతూ వేయించండి. తర్వాత వీటిని మిక్సీలో వేసి పొడి చేసుకోండి.
కడాయి తీసుకోని అందులో ఆవాల గింజలను వేసుకొని పొడిగా వేయించండి, ఇప్పుడు సోంపు మరియు మెంతులు వేసుకొని తక్కువ మంటమీద 2 -3 నిముషాలు కలుపుతూ వేయించండి. తర్వాత వీటిని మిక్సీలో వేసి పొడి చేసుకోండి.
కడాయి లో కోసి పెట్టుకున్నవెల్లుల్లి పాయల్ని వేసుకొని బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి వెల్లుల్లి పాయలు బంగారు రంగులో వచ్చేంత వరకూ వేయుంచుకోండి. ఇప్పుడు ఇంతకముందు తయారు చేసి పెట్టుకున్న పెట్టుకున్న మసాలా పొడిని వేసుకోవాలి అలాగే పసుపు, కారం పొడి మరియు ఉప్పును కూడా వేసికొని అన్ని పదార్దాలను బాగా కలుపుకోవాలి.
దీనిని 2 నుంచి 3 నిముషాలు అలానే ఉంచాలి. తరువాత గ్యాస్ ని ఆపేసుకోండి. నిమ్మకాయ రసం ని పోసుకొని బాగా కలుపుకోవాలి. అంతేనండి..రుచికరమైన ఆచార్ రెడీ అయిపొయింది. అవసరం అనుకుంటే వెనిగర్ వేసుకోవచ్చు.
ఇలాంటి మరిన్ని కుకింగ్ ఆర్టికల్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: