రుచికరమైన పాలక్ పరాఠా ఎలా చెయ్యాలో తెలుసుకోండి...

Purushottham Vinay
పాలక్ చాలా ఆరోగ్యవంతమైన ఆకు కూర.. ఇది ఎక్కువగా నార్త్ ఇండియన్స్ తయారు చేసుకుంటారు. చాలా హెల్తీ ఫుడ్. చిన్న పిల్లలకి చాలా మంచిది. వారికి బాగా జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. కాబట్టి చిన్నపిల్లలకి అలవాటు చెయ్యడం చాలా మంచిది. అలాగే దీంట్లో ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది తింటే  చాలా పుష్టిగా ఉంటారు. ఇక పాలక్ తో మనం పరాఠా కూడా చేసుకోవచ్చు. ఇక విషయానికి వస్తే ఈ  పాలక్ పరాఠా ఇది అత్యంత సులువైన రెసిపీ అని చెప్పొచ్చు. దీనిని మనం ఇంట్లోనే త్వరగా తయారు చేసుకోవచ్చు.పరాఠాలో ఆరోగ్యకరమైన ఆకుకూరలని కలిగి ఉన్నందున ఇది మంచి పౌష్టికమైన రెసిపీ అనే చెప్పాలి.సాధారణంగా పాలకూర అంటే చిన్న పిల్లలు తినటానికి ఇష్టపడరు అలాంటి వారికీ ఈ పాలక్ రెసిపీ ని ఎంచుకోవటం ద్వారా పిల్లలు ఇష్టంగా తింటారు. ఈ రుచికరమైన రెసిపీ ని సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ లో  చూడండి....
పాలక్ పరాఠా తయారు చేయు విధానం...
ప్రధాన పదార్థం...
రెండు వందల గ్రాములు పాలకూర
మూడు కప్ ల మైదా
ప్రధాన వంటకానికి
రెండు టీ స్పూన్ నెయ్యి
ముద్దలా చేయుటకు...
రెండు టీ స్పూన్ సోపు
అవసరాన్ని బట్టి ఉప్పు
ఒక కప్ పాలు
పాలకూర ని తీసుకోని మిక్సీ లో వేసుకొని ప్యూరీని చేసుకొని ఒక పక్కన పెట్టుకోండి.
ఒక గిన్నెను తీసుకోని అందులో గోధుమ పిండి, రుచికి సరిపడా ఉప్పు, వాము, నెయ్యి మరియు ఇంతకముందు చేసి పెట్టుకున్న పాలక్ ప్యూరీ ని వేసుకొని పిండిని మెత్తగా కలుపుకోవాలి. పిండి మెత్తగా ఇంకా రుచిగా ఉండటానికి కొంచెం పాలను పిండిలో పోసుకొని కలుపుకోండి.
పిండిని చిన్న-చిన్న ముద్దలుగా చేసుకువాలి. ఇప్పుడు కొంచెం నెయ్యి అలాగే కొద్దిగా గోధుమ పిండిని చల్లాలి..
ఇప్పుడు వాటిని గోధుమ పిండిలో ముంచి తీసి అద్దుకుంటూ పరాఠాల్లాగా చేసుకోవాలి.
తవ్వాని తీసుకోని వేడిచేయండి. తవ్వా వేడి అయ్యాక, పరాఠాలని తవ్వా మీద వేసుకొని రెండువైపులా సమంగా కాలేలాగా చూసుకోవాలి. కొద్దిగా నెయ్యిని రెండు వైపులా వేసి కలిస్తే పరాఠాలు మెత్తగా ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: