రొయ్యల పులిహోర ఎలా చేయాలి అంటే..!

Sahithya
నాన్ వెజ్ లో మనకు ఓపిక ఉండాలే గాని చాలా రకాల వంటలు చేసుకోవచ్చు. చాలా రకాల వంటలు మనకు తెలియదు కూడా. ఇప్పుడు మీ కోసం రొయ్యల పులిహోర ఎలాగో చెప్తాను.
పచ్చి రొయ్యలు (పొట్టు తీసి శుభ్రం చేసినవి) – అర కిలో (చిన్న సైజువి) కావాలి. అలాగే వేగించిన ధనియాల పొడి - 1 టీ స్పూను కావాలి. మిరియాల పొడి - అర టీ స్పూను కావాలి. బియ్యం – అర కిలో, నూనె – అర కప్పు, చింత పండు - 100 గ్రా, ఎండు మిర్చి - 5, శనగలు (నానబెట్టినవి) - 1 టేబుల్‌ స్పూను కావాలి. అలాగే మెంతులు - అర టీ స్పూను, ఆవాలు - అర టీ స్పూను, పసుపు పొడి - అర టీ స్పూను కావాలి. కరివేపాకు రెబ్బలు -10, ఉప్పు – తగినంత వేసుకోండి చాలు.
 
తయారుచేసే విధానం ఎలా అంటే... రొయ్యలను ఉడికించి నీరు లేకుండా ఆరబెట్టి వాటికి ధనియాల, మిరియాల పొడులతో పాటు తగినంత ఉప్పు పట్టించి పక్కన పెట్టండి. మూడు కప్పుల (గోరు వెచ్చటి) నీటిలో చింత పండు నానబెట్టి పులుసు తయారు చేసుకుని పెట్టండి. అన్నం (కాస్త పలుకుగా) వండి చల్లార్చుకుని... ఇప్పుడు కడాయిలో ఎండు మిర్చి, ఆవాలు, శనగలు, కరివేపాకు వేసి నూనెలో దోరగా వేగించి ఆ పైన రొయ్యలు కూడా వేసి కాస్త వేయించి...  అప్పుడు చింతపండు పులసు కలిపి, ఉప్పును జత చేసి బాగా చిక్కబడే వరకు సన్నని మంటపై ఉంచాలి. అప్పుడు పులుసు బాగా చల్లారనిచ్చి కొద్ది కొద్దిగా అన్నంలో కలపండి. పులిహోర ముద్ద ముద్దకు ఒక రొయ్య తగిలేలా చూసుకుంటే చాలు... మీకు నోరు ఊరించే రొయ్యల పులిహోర రెడీ అయినట్టే అన్నమాట...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: