హెరాల్డ్ స్పెషల్ కర్రీ : తలకాయ మాంసం కూర ఇలా వండితే తినని వాళ్ళు కూడా అద్భుతం అంటారు.. !!

Suma Kallamadi
తలకాయ మాంసం తినడానికి చాలా మంది అయిష్టత చూపిస్తారు.అదే మాంసం తినమంటే లొట్టలు వేసుకుంటూ తింటారు. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మేక తలకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. ఒకప్పుడు బిడ్డని ప్రసవించిన బాలింతలకు ఈ మేక తలకాయ కూర పెట్టేవాళ్ళు.తల్లి ద్వారా బిడ్డకు పాల రూపంలో పోషకాలు అంది బిడ్డ తలకాయ నిలుపుతుందని ఈ తలకాయ మాంసం పెట్టేవారు. అయితే ఈ కూరని చాలా మందికి ఎలా చేయాలో తెలీదు.వండే విధంగా వండితే తినని వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ తింటారు. దీనిని సులువుగా, రుచికరంగా ఎలా వండుకోవాలో నేర్చుకుందాం.
కావలసిన పదార్ధాలు:
1)మేక తలకాయ మాంసం - ఒక కేజీ,
2) ఉల్లిపాయలు - రెండు,
3)కారం - నాలుగు టీస్పూన్లు,
4) కొబ్బరి పొడి - మూడు టీస్పూన్లు,
5)ధనియాల పొడి - రెండు టీస్పూన్లు,
6) పచ్చిమిర్చి - రెండు,
7)వెల్లుల్లి రెబ్బలు - ఐదారు,
8) పసుపు - ఒక టీస్పూన్‌,
9)జీలకర్ర - అర టీస్పూన్‌,
10)అల్లంవెల్లుల్లి పేస్టు - ఒక టీస్పూన్‌,
11)లవంగాలు - ఎనిమిది,
12)సాజీర - అర టీస్పూన్‌,
12)మిరియాలు - అరటీస్పూన్‌,
14) దాల్చిన చెక్క - కొద్దిగా,
15)యాలకులు - నాలుగు
16) నూనె - సరిపడా
17) ఉప్పు - రుచికి తగినంత
తయారీ విధానం :
ముందుగా మసాలా తయారు చేసుకోవాలి. మిక్సీలో కొద్దిగా ఉల్లిపాయలు, జీలకర్ర, ధనియాల పొడి, కొబ్బరి పొడి, వెల్లుల్లి రెబ్బలు, మిరియాలు, దాల్చినచెక్క, లవంగాలు, సాజీర వేసి మెత్తగా పేస్టులా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్‌ వెలిగించి కుక్కర్‌ పెట్టి నూనె వేసి వేడి అయ్యాక ఉల్లిపాయలు వేసి వేగించాలి. తలకాయ మాంసం కుక్కర్ లో పెట్టి వండితెనే మాంసం ముక్కలు బాగా ఉడుకుతాయి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాక  పచ్చిమిర్చి,పసుపు,అల్లం వెల్లుల్లి పేస్టు వేసి  పచ్చివాసన పోయేదాకా వేయించాలి. ఇప్పుడు తలకాయ మాంసం వేసి మూత పెట్టి చిన్నమంటపై పది నిమిషాలు ఉడికించాలి. తరువాత తయారుచేసి పెట్టుకున్న మసాలా పేస్టు వేయాలి.

 బాగా కలిపి మూత పెట్టి మరో ఐదు నిమిషాలు ఉడికించాలి.తగినంత కారం, ఉప్పు వేసి కలియబెట్టాలి. మాంసం ఉడకడానికి సరిపడా నీళ్లు పోయాలి.ఒక్కసారి కూర అంతా తిప్పి  కుక్కర్‌ మూత పెట్టి ఆరు విజిల్స్‌ వచ్చే వరకు ఉడికించాలి. ఆవిరి పోయాక మూత తీయాలి. కొత్తిమీరతో గార్నిష్‌ చేసి సర్వ్‌ చేసుకోవాలి..అంతే ఎంతో టేస్టీగా ఉండే తలకాయ మాంసం కూర రెడీ.ఒక్కసారి రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది.. !!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: