వంటా వార్పు: క్రిస్పీ క్రిస్పీ `మీల్ మేకర్ పకోడీ` ఎలా చేయాలో తెలుసా..?

Kavya Nekkanti

కావాల్సిన ప‌దార్థాలు: 
మీల్‌మేకర్ - ఒక క‌ప్పు
శనగపిండి - అర కప్పు
ఉల్లిపాయ ముక్క‌లు - ఒక కప్పు

 

కార్న్‌ఫ్లోర్ - అర కప్పు
బియ్యంపిండి - అర కప్పు
నిమ్మకాయం రసం - ఒక‌ స్పూన్
గ‌రం మ‌సాలా - పావు టీ స్పూన్‌



అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒక టీ స్పూన్‌
కరివేపాకు - నాలుగు రెబ్బ‌లు
నూనె - త‌గినంత‌
జీల‌క‌ర్ర - అర టీ స్పూన్‌

 

ఉప్పు - రుచికి సరిపడా
కారం - అర స్పూన్‌
కొత్తిమీర తురుము - అర‌ కప్పు

 

త‌యారీ విధానం: 
ముందుగా స్ట‌వ్ ఆన్ చేసి పాన్ పెట్టి నీళ్లు పోసి మ‌రిగించాలి. నీళ్లు బాగా మరిగాక‌‌ మీల్ మేకర్ అందులో వేసేసి, స్టవ్ ఆఫ్ చేయాలి. పదినిమిషాల పాటు మీల్ మేకర్ ను నీళ్లలోనే నాన‌బెట్టాలి. ఇప్పుడు నీళ్లు పిండేసి మీల్ మేకర్ మిక్సీలో వేసి తురుములా చేసుకోవాలి. 

 

ఇప్పుడు ఓ బౌల్ తీసుకుని అందులో మీల్ మేకర్ తురుము, బియ్యంపిండి, కార్న్ ఫ్లోర్, శెనగ పిండి, అల్లం వెల్లుల్లి పేస్టు, గ‌రం మ‌సాలా, జీల‌క‌ర్ర‌, ఉప్పు, కారం, కరివేపాకు, కొత్తి మీర, ఉల్లిపాయ ముక్కలు, కారం అన్ని వేసి కాస్త నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. 

 

ఇప్పుడు స్ట‌వ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని నూనె వేడి చేయాలి. నూనె వేడెక్కాక‌.. ముందుగా క‌లిపి పెట్టుకున్న పిండిని పకోడీల్లా వేసుకుని బాగా వేగాక ప్లేట్‌లోకి తీసుకోవాలి. అంటే క్రిస్పీ క్రిస్పీ మీల్ మేకర్ పకోడీ రెడీ. వేడి వేడిగా వీటిని తింటే అదిరిపోతాయి. కాబ‌ట్టి, మీరు కూడా ఈ టేస్టీ మీల్ మేకర్ పకోడీని ట్రై చేసి ఎంజాయ్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: