వంటా వార్పు: య‌మ్మీ య‌మ్మీ `సొరకాయ పాయసం` త‌యారు చేసుకోండిలా..!!

Kavya Nekkanti

కావాల్సిన ప‌దార్థాలు:
సొరకాయ- ఒక‌టి
పాలు- అర లీటర్
కోవా- రెండు టీ స్పూన్లు

 

చక్కర- అర క‌ప్పు
నెయ్యి- రెండు టీ స్పూన్లు
యాలకుల పొడి- అర టీ స్పూన్

 

బాదం- ఎనిమిది
జీడిపప్పు- ఎనిమిది
పిస్తా పప్పు- ఎనిమిది
కిస్‌మిస్‌- ప‌ది

 

త‌యారీ విధానం: ముందుగా సొరకాయను మెత్తగా తురుముకోవాలి. ఆ తరువాత దాని నుండి అదనపు నీటిని తొలగించి ప‌క్క‌న పెట్టుకోవాలి. ఇప్పుడు స్ట‌వ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకుని రెండు టీస్పూన్ల నెయ్యి వేసి అందులో ముందుగా తురిమి పెట్టుకున్న‌ సొరకాయను వేసి ఐదు నిమిషాలు వేయించాలి. ఇప్పుడు అందులో పాలు వేసి మరిగించాలి.

పాలు చిక్కగా మారుతున్న సమయంలో, అందులో చక్కెర వేసి ఐదు నిమిషాలు ఉడికించాలి. ఐదు నిమిషాల త‌ర్వాత అందులో కోవా కూడా వేసి కాసేపు ఉడికించుకోవాలి.  ఇక చివ‌రిగా ఇందులో బాదం, పిస్తా, జీడిపప్పు, కిస్‌మిస్‌, యాలకుల పొడి వేసి చిక్కగా వచ్చే వరకు ప‌ది నిమిషాలపాటు ఉడికించాలి. 

ఆ తర్వాత స్ట‌వ్ ఆఫ్ చేసి స‌ర్వింగ్ బౌల్‌లోకి తీసుకుంటే స‌రిపోతుంది. అంటే ఎంతో రుచిక‌ర‌మైన‌, సులువైన య‌మ్మీ య‌మ్మీ సొరకాయ పాయసం రెడీ అయిన‌ట్లే. దీనిని వేడిగా లేదా చల్లగా తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. కాబ‌ట్టి, ఈ లాక్‌డౌన్ టైమ్‌లో సొరకాయ పాయసంను పైన చిప్పిన విధంగా త‌యారు చేసుకుని ఎంజాయ్ చేయండి. దీనిని పిల్ల‌లు కూడా ఇష్టంగా తింటారు. మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ప్రోసెస్ స్టార్ట్ చేయండి మ‌రి.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: