వంటా వార్పు: `సొరకాయ‌ పొట్టు చట్నీ` ఇలా చేస్తే ఎంత‌ టేస్టీగా ఉంటుందో తెలుసా..?

Kavya Nekkanti

కావాల్సిన ప‌దార్థాలు: 
సొరకాయ పొట్టు- అర కప్పు
మినప్పప్పు- ఒక‌ టేబుల్‌ స్పూన్‌
చింత పండు పులుసు- పావు కప్పు
శనగపప్పు- ఒక‌ టేబుల్‌ స్పూన్‌

 

నూనె- రెండు టేబుల్‌ స్పూను
కొత్తిమీర‌- కొద్దిగా
ఉప్పు- రుచికి స‌రిప‌డా
ఎండుమ్చి- నాలుగు

 

ఉల్లిపాయు- ఒక‌టి
టమాటా- ఒక‌టి
వెల్లుల్లి రెబ్బలు- నాలుగు
క‌రివేపాకు- మూడు రెబ్బ‌లు

 

తయారీ విధానం: ముందుగా ఒక పాన్‌లో కొద్ది నూనె పోసి శనగపప్పు, మినప్పప్పు వేసివేగించాలి. తర్వాత ఎండుమ్చి, టమాటా ముక్క‌లు, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి వేసి కాసేపు వేగించాలి. ఇప్పుడు సొరకాయు పొట్టు, కొత్తిమీర, కరివేపాకు కూడా వేసి మ‌రికాసేపు వేగించాలి. 

 

ఆ తర్వాత చింతపండు పులుసు, పసుపు వేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించి స్టౌ ఆఫ్ చేయాలి. ఈ మిశ్ర‌మం చల్లారిన తర్వాత త‌గినంత ఉప్పు వేసి మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. దీనికి చివ‌రిగా పోపు పట్టుకుని వేడి వేడి రైస్ లేదా రోటీలో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సో.. మీ ఖ‌చ్చితంగా ట్రై చేయండి.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: