ఈ అనుమానం ముందే వస్తే.. 4.54 లక్షలు మిగిలేవి?

praveen
ఇటీవల కాలంలో జనాలందరూ సోషల్ మీడియా అనే కొత్త ప్రపంచంలో బ్రతికేస్తూ ఉన్నారు. ఎన్ని పనులను ఏం చేస్తున్నా కూడా అన్ని పక్కన పెట్టేసి సోషల్ మీడియాలో గంటలు తరబడి కాలం గడుపుతున్న వారే నేటి రోజుల్లో ఎక్కువగా కనిపిస్తున్నారు. పక్కన ఉన్న స్నేహితులను వదిలేసి మరిసోషల్ మీడియాలో ఎక్కడో ఉన్న స్నేహితులతో మాట్లాడటానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అంతేకాదు ప్రేమలు, పెళ్లిళ్లు కూడా నేటి రోజుల్లో ఆన్లైన్ మయం అయిపోయాయి అని చెప్పాలి.

 అయితే కొన్ని కొన్ని సార్లు ఇలా సోషల్ మీడియా వేదికగా అవుతున్న పరిచయాలు చివరికి నట్టేట ముంచుతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయ్. ఇటీవల కర్ణాటక రాజధాని బెంగళూరులో కూడా ఇలాంటి తరహా ఘటన జరిగింది. 37 ఏళ్ల మహిళకు సోషల్ మీడియా ద్వారా ఏర్పడిన పరిచయం చివరికి లక్షల రూపాయలు పోగొట్టుకునే పరిస్థితిని తీసుకువచ్చింది. చివరికి చేసేదేమీ లేక లబోదిబోమ్మంటూ  సదరు బాధితురాలు  పోలీసులను ఆశ్రయించింది. బెంగళూరుకు చెందిన 37 ఏళ్ల మహిళ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ ఉంటుంది. అయితే డేటింగ్ యాప్ టిండర్ ద్వారా ఒక వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడింది.

 అయితే తన పేరు అద్వైక్ చోప్రా అని ప్రస్తుతం లండన్ లో డాక్టర్ ప్రాక్టీస్ లో ఉన్నాను అంటూ ఆమెకు చెప్పాడు సదర్ వ్యక్తి. అయితే ఆమె తరచూ సదరు వ్యక్తితో చాటింగ్ చేయడం మాట్లాడటం చేసింది. పరిచయం కాస్త కొంతకాలానికి ప్రేమగా మారింది. ఇక అతని గుడ్డిగా నమ్మేసింది. అయితే ఓ రోజు సదర మహిళను చూసేందుకు అద్వైక్ చోప్రా బెంగళూరు వస్తున్నట్లు చెప్పాడు. అంతలో ఆమెకు గుర్తుతెలియని ఫోన్ నెంబర్ నుంచి కాల్ వచ్చింది. అవతలి వ్యక్తి  ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ను ఫోన్ చేస్తున్నాను. లండన్ నుంచి భారత్కు వచ్చిన చోప్రా కొంత నగదు తో ఏర్పోర్ట్ లో పట్టుబడ్డాడు.. వాటిని స్వాధీనం చేసుకున్నాం. విడిచి పెట్టేందుకు 4.54  లక్షల పంపించాలి అంటూ కోరాడు.. ఇక నమ్మిన ఆమె వెంటనే డబ్బు పంపింది. తర్వాత కొద్దిసేపటికి మళ్ళీ ఫోన్ చేస్తే ఆరు లక్షల పంపాలి అన్నాడు. దీంతో అనుమానం వచ్చి అవతలి వ్యక్తిని ప్రశ్నించింది. కాల్ కట్ అయింది. ఆ తర్వాత వెంటనే ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది  మోసపోయానని గ్రహించి చివరికి పోలీసులను ఆశ్రయించింది సదరు మహిళ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: