లేడీ టీచర్స్ మధ్య WWE ఫైట్ .. ఎక్కడో తెలుసా?

praveen
తల్లి దండ్రులు కేవలం జన్మనిస్తే.. ఇక జీవితం మొత్తం సరైన మార్గం లో నడిచే తెలివిని ఇచ్చేది మాత్రం గురువులే అని చెప్పాలి. ఇక ప్రస్తుతం అత్యున్నతమైన స్థానంలో ఉన్నవారు సైతం ఒకప్పుడు ఇక గురువుల దగ్గర పాఠాలు నేర్చుకున్న వారే. ఇక ఇలా తమ వద్ద చదువుకుంటున్న పిల్లలను సన్మార్గం లో నడిపించడానికి ఎంతో మంది ఉపాధ్యాయులు కష్ట పడుతూ ఉంటారు.అయితే స్కూల్లో ఎప్పుడైనా విద్యార్థులు గొడవ పడినప్పుడు.. అలా గొడవ పడ కూడదు స్నేహితుల్లా మెలగాలి అనిచెబుతూ ఉంటారు టీచర్లు.

 కానీ ఇక్కడ టీచర్లు మాత్రం అలా కాదు విద్యార్థులకు గొడవ పడొద్దు అని చెప్పడం కాదు.. టీచర్లే ఏకంగా సిగపట్లు పట్టుకున్నారు. దారుణంగా ఒకరిపై ఒకరు దాడి చేసుకుని కొట్టుకున్నారు. ఇక ఈ ఫైటింగ్ సీన్ మొత్తం విద్యార్థుల ముందే జరగడం గమనార్హం. బీహార్ లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.. కొరియా గ్రామపంచాయతీ విద్యాలయంలో ఈ ఫైటింగ్ సీన్ జరిగింది. స్కూల్ క్లాస్ రూమ్స్ కిటికీలు మూసివేయడంపై మొదలైన చిన్న వాదన.. చిలికి చిలికి గాలి వానలా మారిపోయింది. ఈ క్రమంలోనే ప్రధానోపాధ్యాయురాలు మరో ఇద్దరు లేడీ టీచర్లకు ఈ విషయంపై వార్నింగ్ ఇచ్చింది.


 అయితే ప్రధానోపాధ్యాయురాలు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన మరో ఇద్దరు లేడీ టీచర్స్ ఏకంగా ప్రధానోపాధ్యాయురాలిపై దాడికి పాల్పడ్డారు.  మాటలు యుద్ధం కాస్త కొట్టుకునేంతవరకు వెళ్ళింది. ఈ ఫైటింగ్ సీన్ లో ప్రధానోపాధ్యాయులు మరో టీచర్ సిగపట్లు పట్టుకోగా.. ఇంకో టీచరమ్మ ఇద్దరితో కలిసి ఫైట్ చేసింది. ఇక ఈ ఘటన కాస్త సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి. ఏకంగా బుద్ధి చెప్పాల్సిన టీచర్లు ఇలా బుద్ధి లేకుండా ప్రవర్తించడంతో అక్కడున్న విద్యార్థులు అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ ఘటన ఉన్నతాధికారుల వరకు వెళ్లగా.. విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: