వెనక్కి వెళ్లిన ట్రైన్.. బాలయ్య సినిమాలో కాదు.. ఇది నిజంగానే?

praveen
సాధారణంగా అయితే పట్టాలపై ట్రైన్ ఎంతో వేగంగా ముందుకు దూసుకుపోతుంది అన్న విషయం అందరికీ తెలుసు. ఒకప్పుడైతే బొగ్గుతో రైలు నడిచేది. కానీ ఇప్పుడు కరెంటుతోనే రైలు నడుస్తుంది. కానీ ఇలా పట్టాలపై ముందుకు దూసుకుపోయే రైలు ఏకంగా వెనక్కి వెళ్లడం ఎప్పుడైనా జరుగుతుందా. ఇలా అడుగుతే జరుగుతుంది అని చెబుతారు. అయితే ఇది నిజజీవితంలో కాదు బాలయ్య హీరోగా నటించిన ఒక సినిమాలో బాలయ్య తొడగొడితే చాలు రైలు వెనక్కి పరుగులు పెట్టడం లాంటి సీన్ చూసి ప్రేక్షకులు ఎంతో మంది నవ్వుతూనే ఉంటారు.

 అందుకే ట్రైన్ వెనక్కి వెళ్లడం అనే మాట వినిపించింది అంటే చాలు ప్రతి ఒక్కరికి కూడా బాలయ్య సినిమాలోని ఆ సన్నివేశమే గుర్తుకు వస్తూ కాసేపు నవ్వుకుంటూ ఉంటారు అని చెప్పాలి. కానీ నిజ జీవితంలో ఇలా ట్రైన్ వెనక్కి వెళ్తుందా అంటే అలాంటిది జరగడం అసాధ్యమని చెబుతారు. కానీ కేరళాలో మాత్రం ఇలాంటి విచిత్రకరమైన ఘటన జరిగింది. ఈ ముందుకు దూసుకెళ్లే ట్రైన్ బాలయ్య సినిమాలో లాగానే వెనక్కి పరుగులు పెట్టింది. ఈ ఘటన చూసి అక్కడ ఉన్న ప్రయాణికులు అందరూ కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు అని చెప్పాలి.

 ఏకంగా స్టేషన్లో ఆగకుండానే ఒక రైలు ఇలా ముందుకు వెళ్లిపోయింది. అయితే షోర్నూర్ నుంచి వేనాడు వెళ్లే ఎక్స్ప్రెస్ రైలు చేరియానాడు స్టేషన్లో ఆగాల్సి ఉంది. అయితే రైలు ఆగకుండానే ముందుకు వెళ్లడంతో ఎక్కాల్సిన దిగాల్సిన ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే దాదాపు ఒక కిలోమీటర్ వరకు ఇలా రైలు ముందుకు వెళ్లిపోయింది. అయితే ఇలా ముందుకు వెళ్లిన తర్వాత డ్రైవర్ ఈ విషయాన్ని గమనించాడు. దీంతో ఒక కిలోమీటర్ రైలుని  వెనక్కి ఫోనిచ్చాడు అని చెప్పాలి. అయితే ఇది లోకో పైలట్ తప్పిదంగా భావించిన ఉన్నతాధికారులు.. వివరణ కోరినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా అటు రైలు వెనక్కి వెళ్లడం కేవలం సినిమాలలోనే అనుకున్నాం. కానీ నిజజీవితంలో కూడా నిజంగానే జరిగింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: