వాట్సాప్ డీపీ.. ఆమెను జైలు పాలు చేసింది?

praveen
ఇటీవల కాలంలో టెక్నాలజీ అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఈ క్రమంలోనే ఇక సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాని ఒకే రీతిలో ఉపయోగించుకుంటున్నారు. ఇక సామాన్యులకు సెలబ్రిటీలకు తేడా కేవలం ఒక బ్లూటిక్ మాత్రమే అన్నట్లుగా మారిపోయింది పరిస్థితి. ఈ క్రమంలోనే ప్రతి చిన్న విషయాన్ని కూడా సోషల్ మీడియాలో పెట్టడం ప్రస్తుతం ఒక ట్రెండ్ గా మారిపోయింది. ఎంతోమంది తమకు నచ్చిన ఫోటోలను వాట్సప్ డీపీగా పెట్టుకోవడం లాంటివి చేస్తున్నారు. ఇంకొంతమంది మనసులో ఉన్న భావాలను వాట్సాప్ స్టేటస్ లాగా పెట్టుకుని అందరికీ తెలిసేలా చేస్తున్నారు.

 ఇలా మనసులో ఉన్న భావాలను వాట్సాప్ స్టేటస్ ద్వారా ఇతరులకు వ్యక్తపరచడం కూడా చేస్తున్నారు. మరి కొంతమంది ఇలా టెక్నాలజీని ఎవరికి తోచిన విధంగా వారు గట్టిగానే వాడుతున్నారు అని చెప్పాలి. అయితే కొన్ని కొన్ని సార్లు మాత్రం ఇలా సోషల్ మీడియా పిచ్చి కారణంగా చివరికి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులను కూడా కొనితెచ్చుకుంటున్నారు చాలామంది. ఇక్కడ ఒక మహిళ విషయంలో ఇలాగే జరిగింది. వాట్సాప్ డీపీ కారణంగా ఓ మహిళా చివరికి జైలు పాలు కావలసిన పరిస్థితి ఏర్పడింది. అదేంటి వాట్సాప్ డీపీ పెడితే తప్పు ఏముంది.  అదేం పెద్ద క్రైమ్ కాదు కదా అనుకుంటున్నారు కదా.

 అయితే ఇక్కడ మనం మాట్లాడుకునే వాట్సాప్ డీపీ వెనకాల మాత్రం పెద్ద స్టోరీనే ఉంది. కొట్టేసిన బంగారం తో ఫోటో దిగి వాట్సాప్ డీపీ పెట్టిన మహిళ చివరకు పోలీసులకు చిక్కింది. మధ్యప్రదేశ్ భూపాల్ లో  దాదాపు 50 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలనుచోరీ జరిగిందని యజమాని పోలీసులను ఆశ్రయించాడు. ఇటీవల ఇలా చోరికి గురైన నగలను పెట్టుకున్న పనిమనిషి ఫోటో దిగి వాట్సాప్ డీపీ పెట్టింది. ఇది చూసిన యజమాని పోలీసులకు సమాచారం అందించగా ఆమెను అదుపులోకి తీసుకొని విచారిస్తే నేరం అంగీకరించింది. అయితే ఆమె వద్ద నుంచి ఐదు లక్షల విలువైన నగలను రికవరీ చేశారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Dp

సంబంధిత వార్తలు: