ఎంతకు బరితెగించారు.. పాపులారిటీ కోసం నడిరోడ్డు మీదే ఆ పని చేసారు?

praveen
ఇటీవల కాలంలో జనాలందరూ కూడా సోషల్ మీడియా అనే మాయలో పడిపోయి అందులోనే మునిగి తేలుతున్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించుకోవడం కోసం కొంతమంది పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం. ఇలా ఫాలోవర్స్ ని పెంచుకోవడానికి చేస్తున్న చిత్ర విచిత్రమైన పనులు సోషల్ మీడియాలో ఎప్పుడు వైరల్ గా మారిపోతూనే ఉన్నాయి. ఇప్పుడు ఒక జంట నడిరోడ్డుపై చేసిన పని కాస్త అందరిని  అవాక్కయ్యేలా చేస్తూ ఉంది.

 నాలుగు గోడల మధ్య చేయాల్సిన స్నానాన్ని.. నడిరోడ్డు మీద చేసేసింది ఆ జంట. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. మహారాష్ట్రలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. తానే జిల్లా ఉల్లాస్ నగర్ లోని ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఒక జంట ఏకంగా స్కూటర్ పై వచ్చి సిగ్నల్ దగ్గర ఆగారు. అయితే యువతి తన వెంట తెచ్చుకున్న బకెట్ లోని నీటిని మగ్గుతో తీసి తన ముందు బైక్ నడుపుతున్న వ్యక్తి తల మీద పోస్తుంది. ఇక ఆ తర్వాత ఇక తన తలపై కూడా పోసుకుని స్నానం చేస్తున్నట్లుగా కవరింగ్ ఇచ్చింది. అయితే వాళ్ళు చేస్తున్న పని చూసి అక్కడ ఉన్న వారందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు అని చెప్పాలి.

 కొంతమంది ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఉన్న జనాలు ఇక వీరు చేస్తున్న పిచ్చి పని చూసి నవ్వుకున్నారు. ఇక ఆ సిగ్నల్ దగ్గర గ్రీన్ సిగ్నల్ పడ్డాక ముందుకు వెళ్తూ కూడా యువతి అతనిపై నీళ్లు పోయడం ఇక తనపై నీళ్లు పోసుకోవడం చేస్తూ ఉంది. దీంతో ఇక రోడ్డు పక్కన ఉన్న వారందరూ కూడా వారిని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇక ఈ వీడియో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. అయితే ఇక దీనిపై మాత్రం నేటిజన్స్  కాస్త ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అని చెప్పాలి. సరదా పేరుతో చేసే ఇలాంటి పనికిమాలిన పనులను ఎలా అనుమతిస్తారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు స్థానికులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: