పుష్ప సినిమాను మించిన సీన్.. పైకి ఇసుక లారీ.. కానీ?

praveen
అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమాను మీరు చూసే ఉంటారు. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ సాధించింది. అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్ ఇక ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేసేందుకు వేసే ఎత్తుగడలు అందరినీ ఆశ్చర్యానికి లోన్ చేస్తూ ఉంటాయి అని చెప్పాలి. ఏకంగా పోలీసుల కళ్ళుగప్పి ఎర్రచందనం స్మగ్లింగ్ చేయడం ఈ సినిమాలో చూడవచ్చు. అయితే ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు వచ్చిన తర్వాత మాత్రం ఎంతో మంది అక్రమార్కులు పుష్ప సినిమా తరహాలోనే ఇక వినూత్నమైన రీతిలో స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నించిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి.

 అయితే కేవలం అక్రమార్కులు మాత్రమే కాదు పోలీసులు కూడా పుష్ప సినిమా చూసే ఉంటారు. దీంతో అక్రమార్కులు వేసే ఎత్తుగడలకు పైఎత్తులు వేసి చివరికి అక్రమ రవాణాను అడ్డుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన చూస్తే మాత్రం పుష్ప సినిమాలో అల్లు అర్జున్ వేసిన ఎత్తులు కూడా అక్రమార్కుల క్రియేటివిటీ ముందు పని చేయవేమో అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఏకంగా ఇసుక లారీ అనే మాయలో గంధపు చెక్కులను అక్రమంగా స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నించారు అని పోలీసులు. ఎంతో చాకచక్యంగా వ్యవహరించి చివరికి ఈ అక్రమ రవాణాను అడ్డుకున్నారు. ఈ ఘటన ములుగు జిల్లా వాజేడు మండలంలో చోటుచేసుకుంది.

 చతిస్గడ్ రాష్ట్రం తాళ్ల గూడెం నుంచి వాజేడు మండలం టేకులగూడెం గ్రామం మీద ఇసుక లారీ లోడు వెళ్తుంది. అయితే అక్కడ తనిఖీ చేస్తున్న పోలీసులు అనుమానం వచ్చి చెక్ చేయగా ఇక ఇసుక కింద గంధపు చెక్కలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఇసుక ముసుగులో అక్రమంగా తరలిస్తున్న దాదాపు పది లక్షల విలువ గల కలపను పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. అయితే పోలీసులు తనిఖీ చేయడానికి ముందు లారీ డ్రైవర్ భయపడి అక్కడి నుంచి పరారైనట్లు చెప్పుకొచ్చారు అధికారులు. ఇక లారీని వెంకటాపురం రేంజ్ డివిజన్ ఆఫీస్ కి తరలించినట్లు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: