అన్న భార్యను పెళ్ళి చేసుకున్న తమ్ముడు.. శభాష్ అంటున్న నేటిజన్స్?

praveen
సాధారణంగా అన్న భార్య తల్లితో సమానం అని చెబుతూ ఉంటారు. ఎందుకంటే తల్లి తర్వాత తల్లిలా చూసుకుంటూ ఒక ఇంటి బాధ్యతలను కూడా వదిన మోస్తుంది అన్న విషయం తెలిసిందే. అందుకే తల్లిని ఎంత గౌరవిస్తారో వదినకు కూడా అంతే గౌరవిస్తూ ఉంటారు. కానీ ఇటీవల కాలంలో మాత్రం ఎంతోమంది ఏకంగా వదిన వరుస అయ్యే మహిళపై కూడా కామ వాంఛలు పెంచుకుంటూ నీచంగా ప్రవర్తిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఏకంగా వావి వరసలు మరిచి తల్లి లాంటి వదిన ను వేధింపులకు గురి చేస్తున్న ఘటనలు అందరినీ అవక్కాయ్యేల చేస్తూ ఉన్నాయి.

 కానీ ఇక్కడ వదిన విషయంలో ఒక మరిది ఆలోచించిన తీరు మాత్రం ప్రస్తుతం ప్రతి ఒక్కరిని షాక్ కి గురిచేస్తుంది  అయితే కొంతమంది ఇక అతను చేసిన పని గొప్పది అని ప్రశంసలు కూడా కురిపిస్తూ ఉండడం గమనార్హం. ఇంతకీ అతను ఏం చేశాడో తెలుసా అన్న భార్యను పెళ్లి చేసుకున్నాడు. అదేంటి అన్న భార్యను పెళ్లి చేసుకుంటే అది తప్పు అవుతుంది కానీ మెచ్చుకోవడానికి ఏముంది అనుకుంటున్నారు కదా.. ముగ్గురు చిన్నారులు ఉన్న ఆ మహిళ భర్తను కోల్పోయింది. దీంతో ఒంటరిగా జీవిస్తుంది. అయితే ఆ ముగ్గురు చిన్నారుల బాధ్యతలను తండ్రిగా తన భుజాన వేసుకోవాలి అనుకున్నాడు మరిది. ఈ క్రమంలోనే అన్న భార్యను పెళ్లి చేసుకున్నాడు.

 ఇలా చిన్న వయసులోనే  భర్తను కోల్పోయిన మహిళను ఇక తండ్రికి దూరమైన పిల్లలను చూసి చలించిపోయి రాహుల్ వినోద్ అనే వ్యక్తి తన అన్న భార్యను అన్నీ తానై వివాహం చేసుకున్నాడు. శంబాజీ అనే వ్యక్తి గుండెపోటుతో మరణించగా.. అతని భార్యకు ఇద్దరు కవలలతో పాటు ఎనిమిది నెలల కొడుకు ఉన్నాడు. దీంతో ఇక ఒంటరిగా ఉన్న వదినకు కొత్త జీవితం ప్రసాదించి పిల్లల బాధ్యతలను కూడా తీసుకున్నాడు. అతను చేసిన పనిపై నేటిజన్స్ ప్రశంసలు కల్పిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: