పచ్చటి పొలాల్లో భయానక దృశ్యం.. గజగజ వణికిపోతున్న జనం?

praveen
ప్రతి ఒక్కరు కూడా టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ ముందుకు సాగుతున్నారు. దీంతో ఒకప్పటి మూఢ నమ్మకాలను గాలికి వదిలేస్తున్నారు. ఇలా టెక్నాలజీకి అనుగుణం గానే అటు మనిషి జీవన శైలిలో కూడా ఎన్నో వినూత్నమైన మార్పులు వస్తున్నాయి అని చెప్పాలి. అయితే ఇప్పటికి కూడా కొంత మంది ఇంకా మూఢనమ్మకాల ఊబి లోనే కూరుకు పోతున్నారు. మంత్రాలకు చింత కాయలు రాలుతాయి అని నమ్ముతున్నారు. క్షుద్ర పూజల పేరుతో జనాలను భయ భ్రాంతులకు గురి చేస్తున్న వారు చాలా మంది కనిపిస్తున్నారు. అదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం లో ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది.

 సాత్ నెంబర్ అనే గ్రామంలో ఇటీవల క్షుద్ర పూజలు కలకలం సృష్టించాయి. గ్రామానికి చెందిన బిక్కు నాయక్ పంట పొలంలోని ఒక సమాధి వద్ద క్షుద్ర పూజల ఆనవాళ్లు ఉండడం స్థానికంగా అందరిని భయాందోళనకు గురిచేసింది. పసుపు కుంకుమ జీడిగింజలు ఎర్రటి వస్త్రాలు కర్ర బొమ్మ మంత్ర తంతాలతో చేసిన ఆనవాళ్లు కనిపించడంతో ఇక గ్రామస్తులు అందరూ ఒక్కసారిగా భయంతో వణికిపోయారు అని చెప్పాలి. అయితే అప్పటివరకు గ్రామం మొత్తం ప్రశాంతంగా ఉండేది. కానీ ఈ క్షుద్ర పూజలు ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత సాయంత్రం ఏడు గంటల తర్వాత బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు గ్రామస్తులు.

 అయితే జరిగిన ఘటనపై ఇటీవల ఏకంగా గ్రామస్తులు అందరూ కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇక క్షుద్ర పూజలు ఎవరు చేసి ఉంటారు అనే విషయంపై అక్కడ చర్చించారు. అయితే ఎవరైనా ఆకతాయిలు ఇదంతా చేసి ఉంటారని గ్రామస్తులు భావించారు. ఇక ఈ ఘటనపై అటు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు గ్రామస్తులు.  అయితే ఇలా పోలీసులకు ఫిర్యాదు చేసిన కూడా గ్రామస్తుల్లో క్షుద్ర పూజలపై ఉన్న భయం మాత్రం పోలేదు. దీంతో భయంతో బయటికి వెళ్లలేని పరిస్థితిలో మునిగిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: