ప్రేమించాడు.. కానీ పెళ్లిరోజే ప్రియురాలిని చంపేసాడు?

praveen
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ప్రత్యేకమైనది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తమకు నచ్చిన భాగస్వామ్ని జీవితంలోకి ఆహ్వానించి వందేళ్లు ఎంతో సంతోషంగా బ్రతకాలని యువతి యువకులు అనుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే తమ పెళ్లి ఎప్పుడు గుర్తుండిపోయేలా చేసుకుంటూ ఉంటారు అని చెప్పాలి.  ఇక్కడ ఒక యువతి కూడా ఇలాగే ఆశపడింది. నచ్చిన వాడిని పెళ్లి చేసుకుని జీవితాంతం సంతోషంగా బ్రతకాలని కోటి ఆశలు పెట్టుకుంది. ఈ క్రమంలోనే పెళ్లి కోసం సిద్ధమైంది. కానీ ఇలా పెళ్లి చేసుకోవాలని ఆలోచన చివరికి తన జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తుంది అన్న విషయాన్ని మాత్రం అస్సలు ఊహించలేకపోయింది.

 ప్రాణంగా ప్రేమించిన ప్రియుడు పెళ్లి చేసుకొని సంతోషంగా చూసుకుంటాడు అనుకుంటే చివరికి అతనే ఆమెను దారుణంగా చంపేశాడు. పెళ్లి చేసుకోమని అడిగినందుకు ఇక ఇలాంటి దారుణానికి పాల్పడ్డాడు. దీంతో ఇలా ప్రేమించిన వాడి చేతిలోనే దారుణంగా హత్యకు గురైంది ఆ యువతి. ఈ దారుణమైన ఘటన ఉత్తర ప్రదేశ్ లోని లక్నోలో వెలుగులోకి వచ్చింది. అయితే పెళ్లి చేసుకుంటాను అని చెప్పిన రోజే ప్రియుడు ఆమెను హత్య చేశాడు. రాహుల్, కోమలి అనే యువతి యువకులు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.

 అయితే కోమలిని పెళ్లి చేసుకుంటాను అని రాహుల్ గుడ్డిగా నమ్మించాడు. ఇక ఇటీవలే  తనను పెళ్లి చేసుకోవాలి అంటూ కోమలి రాహుల్ను అడిగింది. అతను తప్పించుకుని తిరుగుతున్న వినకుండా ఇక పెళ్లి చేసుకోవాలంటూ అతనిపై మరింత ఒత్తిడి తీసుకువచ్చి బలవంత పెట్టింది. అయితే కోమలితో పెళ్లి నచ్చని రాహుల్ ఇక మాట వరసకు సరే పెళ్లి చేసుకుంటాను అంటూ ఒప్పుకున్నట్లుగా నాటకం ఆడాడు. ఈ క్రమంలోనే కోమలిని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ దారుణంగా గొంతు కోసి హత్య చేశాడు. అయితే బాధితురాలి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు నేరాన్ని ఒప్పుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: