ఇండియాలో ఎక్కువ మంది చెప్పే అబద్ధాలు.. ఇవేనట తెలుసా?

praveen
ప్రతి మనిషి జీవితంలో ఒక్కసారైనా అబద్ధం చెప్పడం సర్వసాధారణం. ఇక ఇటీవల కాలంలో ఇలా అబద్ధాలు చెప్పే వారి రాజ్యం నడుస్తుంది. అబద్ధాలు చెబుతూ ఇక జనాలను గుడ్డిగా నమ్మించే వారిని మంచి వారు అనుకుంటున్నారు అందరూ. నిజాలు మాట్లాడితే ఎవరికీ నచ్చడం లేదు నేటి రోజుల్లో. అయితే మన ఇండియాలో అయితే ఎక్కువ మంది ఇలా చిన్న చిన్న విషయాలకి కూడా అబద్ధాలు చెప్పడం చూస్తూ ఉంటాం. ఇలా అబద్ధం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగంగా మారిపోయింది.

 అయితే సాధారణంగా ప్రతి ఒక్కరు ఏదో ఒక సమయంలో ఏదో ఒక విషయంపై అబద్ధం చెప్పడం చూస్తూ ఉంటాం. కానీ ఇండియాలో ఎక్కువ మంది చెప్పే అబద్ధాలు మాత్రం కొన్ని ఉన్నాయట. ఇక అబద్దాలను దేశవ్యాప్తంగా చాలా మంది తరచూ చెబుతూనే ఉంటారు. ఇంతకీ ఇలా ఇండియాలో ప్రతి ఒక్కరు కూడా కామన్ గా చెప్పే అబద్ధాలు ఏంటి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. ఎక్కువమంది నా దగ్గర రూపాయి లేదు చెబుతూ ఉంటారట. చేతిలో డబ్బులు ఉన్నా  చిల్లి గవ్వ కూడా లేదు అని ఎక్కువగా అబద్ధం చెబుతూ ఉంటారట.

 ఇక ఎవరైనా ఆడవారిని ప్రేమించినప్పుడు వారిని ఇంప్రెస్ చేయడానికి అబద్ధాలు చెబుతారట. నువ్వు నా ఫస్ట్ లవ్ నువ్వంటే నాకు చాలా ప్రాణం అని ఎన్నో అబద్ధాలు చెప్పి అమ్మాయిలను ఇంప్రెస్ చేయాలని ప్రయత్నిస్తూ ఉంటారట. ఇక ఎక్కువ మంది మందుబాబులు రేపటి నుంచి మందు సిగరెట్ తాగడం మానేస్తాను  లాంటి అబద్ధాలు చెబుతూ ఉంటారట. ఇక చాలామంది నా ఫోన్ సైలెంట్ లో ఉంది.. నువ్వు చేసిన ఫోన్చూసుకోలేదు. అందుకే లిఫ్ట్ చేయలేదు అని.. మరి కొంతమంది నేను రేపటి నుంచి మారిపోతా అని చెబుతూ ఉంటారట. ఇంకొంతమంది నేను ఎప్పుడూ నిజాలే మాట్లాడతాను అని కూడా అబద్ధాలు చెబుతారట. ఇలాంటి అబద్ధాలే ఇండియాలో ఎక్కువగా చెబుతూ ఉంటారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: