రిజల్ట్ రాకముందే సూసైడ్.. కానీ ఎన్ని మార్కులొచ్చాయో తెలుసా?

praveen
ఇటీవల కాలం లో వెలుగు లోకి వస్తున్న ఘటనల గురించి తెలిసిన తర్వాత మనిషి జీవితానికి అసలు విలువే లేకుండా పోయింది అన్నది మాత్రం అర్థం అవుతుంది. ఎందుకంటే చిన్న చిన్న కారణాలకి ఏకంగా బలవంతం గా ప్రాణాలు తీసుకుంటున్న వారి సంఖ్య నేటి రోజుల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంది అని చెప్పాలి. ముఖ్యంగా ఇక చదువుకుంటున్న విద్యార్థులు క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాలు ఎంతోమంది తల్లిదండ్రులకు కడుపుకోతను మిగులుస్తూ ఉన్నాయి అని చెప్పాలి.

 ఇటీవల కాలంలో టీచర్ తిట్టిందని లేదా తల్లిదండ్రులు మందలించారని లేదంటే స్నేహితులతో గొడవ జరిగిందని.. చిన్న చిన్న కారణాలతో ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అంతేకాదండో కొంతమంది ఏకంగా పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చాయని ఇంకొంతమంది పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని.. బాధ పడిపోతూ ఇక అక్కడితో జీవిత ముగిసిపోయింది అని అనుకుంటున్నారు. చివరికి ఆత్మహత్య చేసుకుంటున్నారు అని చెప్పాలి. ఇటీవల కాలంలో పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని చనిపోతున్న విద్యార్థుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది.

 ఇప్పుడు ఇలాంటి తరహా ఘటన వెలుగు చూసింది. అతను పరీక్షల్లో పాస్ అయ్యాడు. మంచి మార్కులు కూడా వచ్చాయి. కానీ అతను మాత్రం సూసైడ్ చేసుకున్నాడు. అదేంటి పరీక్షల్లో పాస్ అయ్యాక కూడా ఎందుకు సూసైడ్ చేసుకోవడం అనుకుంటున్నారు కదా. రిజల్ట్ రాకముందే ఫెయిల్ అవుతానేమో అనే భయంతో కృష్ణ అనే విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం బోడగట్ట తండాలో ఈ విషాదకర ఘటన జరిగింది. కానీ ఆ తర్వాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాక అతనికి 1000కి 892 మార్కులు వచ్చాయి. ఏ గ్రేడ్ తో పాస్ అయ్యాడు. దీంతో ఇక అల్లారు ముద్దుగా  పెంచుకున్న కొడుకు క్షణికావేషంలో ప్రాణాలు కోల్పోయాడు అని జీర్ణించుకోలేకపోయిన తల్లిదండ్రులు.. అరణ్య రోదనగా విలపించాడు. తోటి స్నేహితులు సైతం కన్నీరు పెట్టుకున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: