భార్యకు విడాకులిచ్చిన ఆనందం.. బంగి జంప్ చేశాడు.. కానీ చివరికి?

praveen
ఒకప్పుడు పెళ్లి రోజులను పుట్టినరోజులను సెలబ్రేట్ చేసుకునే వారు జనాలు. కానీ ఇటీవల కాలంలో మాత్రం ఏకంగా విడాకులు తీసుకున్న రోజుని కూడా సెలబ్రేట్ చేసుకోవడం చూస్తూ ఉన్నాం. ఇక ఇలాంటి సెలబ్రేషన్స్ కు సంబంధించిన ఘటనలు చాలానే వెలుగులోకి వస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక యువకుడు కూడా తన భార్యకు విడాకులు ఇచ్చిన ఆనందంలో వింతైన సెలబ్రేషన్స్ చేసుకోవాలి అనుకున్నాడు. కానీ ఆ సెలబ్రేషన్స్ చివరికి అతని ప్రాణం మీదికి తెచ్చాయి. ఏకంగా బంజి జంపింగ్ చేయాలని ప్రయత్నించి ఆస్పత్రి పాలు అయ్యాడు.

 అతని పేరు రాఫెల్డోస్ శాంటోస్ టోష్ట. అతని వయసు 22 సంవత్సరాలు. ఇటీవలే బ్రెజిల్ లోని కాంపో మార్గోకి వెళ్ళాడు. అది ఒక మంచి బంగి జంప్ స్పాట్. అక్కడ 70 అడుగుల భయంకరమైన లోయ ఉంటుంది. ఇక వంతెన పైనుంచి బంగి జంప్ చేశాడు సదరు యువకుడు. ఇక అందరూ లాగానే అతను కూడా బంగే జంప్ చేశాడు. కానీ ఎక్కడో తేడా కొట్టేసింది. తాడు ఒక్కసారిగా తెగిపడిపోయింది. దీంతో లోయలోని నీటిలో పడిపోయాడు. అయితే నీరు తక్కువగా ఉండడం అతనికి దురదృష్టంగా మారిపోయింది. ఇంకేముంది అతను కళ్ళు తెరిచి చూసేసరికి ఏకంగా ఆసుపత్రి బెడ్ మీద ఉన్నాడు. చుట్టూ జనం గుమిగుడి ఉన్నారు.

 ఇక ఇప్పుడు ఆస్పత్రి బెడ్ పై కోలుకుంటున్నాడు సదరు యువకుడు. ఇంతకీ ఇంత సాహసం ఎందుకు చేసావ్ అయ్యా అని అడిగితే.. తన భార్యకు విడాకులు ఇచ్చేసిన ఆనందంలో ఏదో సాధించేసిన ఫీలింగ్ వచ్చిందట. దీంతో ఇక జీవితాన్ని బాగా ఎంజాయ్ చేయాలి అనుకున్నాడట. ఎప్పుడు సైలెంట్ గా ఉండే తాను ఇక ఆ సమయంలో మాత్రం చిన్న చిన్న సాహసాలు చేయాలనిపించి.. ఇక బంగి జంప్ చేశాను అంటూ చెబుతున్నాడు సదరు యువకుడు. కానీ ఇలాంటి చేదు అనుభవం ఎదురవుతుంది అని మాత్రం ఊహించలేదని.. అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డాను అని చెబుతున్నాడు సదరు యువకుడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: