పెళ్లి పీటలపై ట్విస్ట్ ఇచ్చిన వధువు.. ముందు అలా చేయాలంటూ?

praveen
పెళ్లి పీటలపై పెళ్లి ఆగిపోయే ఘటనలు కేవలం సినిమాల్లోనే కాదు ఇటీవల కాలంలో నిజజీవితంలో కూడా చాలానే వెలుగులోకి వస్తున్నాయి. చిత్ర విచిత్రమైన కారణాలతో ఎంతోమంది పెళ్లి పీటలపై వివాహాన్ని క్యాన్సల్ చేసుకుంటూ ఉన్నారు అని చెప్పాలి. సాధారణంగా వరుడుకి పెట్టాల్సిన కట్నం పెట్టకపోతే.. వరుడు పెళ్లిని క్యాన్సల్ చేసుకోవడం ఎన్నోసార్లు చూశాము. లేదా మర్యాదలు తక్కువైనా ఇలా వివాహం క్యాన్సిల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి.  కానీ ఇక్కడ మాత్రం మరింత విచిత్రమైన ఘటనే వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి.

 పెళ్లి ఘనంగా జరుగుతుంది. బంధుమిత్రులందరూ కూడా పెళ్లి వేడుకను ఎంతో ఆసక్తిగా వీక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే వరమాల సమయంలో వధువు ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. దీంతో ఇక అక్కడున్న వారందరూ కూడా షాక్ లో మునిగిపోయారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో వెలుగులోకి వచ్చింది. ఏకంగా వరుడి తరపు వారు తనకు తగినంత బంగారం ఇవ్వలేదని చెప్పి.. పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది వధువు. బన్వారి గ్రామానికి చెందిన శ్యామ్ నారాయణ కుమార్తెకు మన్పూర్ గ్రామానికి చెందిన లాల్ రామ్ కుమారుడితో వివాహం నిశ్చయమైంది. ఎలాంటి కట్నకానుకలు తీసుకోకుండానే వరుడు పెద్దమనసూతో పెళ్లికి సిద్ధమయ్యాడు.

 వరుడి కుటుంబ సభ్యులు ఊరేగింపుగా కళ్యాణ మండపానికి చేరుకున్నారు. వధువు కుటుంబ సభ్యులు వారికి ఘనంగా స్వాగతం పలికారు. పెళ్లి తంతు అట్టహాసంగా జరుగుతుంది. అయితే వరమాల తర్వాత ముఖ్యమైన క్రతువులో పాల్గొనాలి అంటే మాత్రం తనకు తగినంత బంగారం బహుమతులు ఇవ్వాలి అంటూ డిమాండ్ చేస్తూ ట్విస్ట్ ఇచ్చింది వధువు. ముందు అవన్నీ ఇస్తేనే పెళ్లి చేసుకుంటాను అంటూ కండిషన్ పెట్టింది. దీంతో వరుడి కుటుంబ సభ్యులే కాదు బంధువులు కూడా షాక్ అయ్యారు. చివరకు ఈ వివాహం క్యాన్సిల్ అయింది. ఇరు కుటుంబ సభ్యులు కూడా పోలీస్ స్టేషన్ వరకు వెళ్లి ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడం గమనార్హం. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: