మటన్ ముక్క.. ఇంటి పెద్ద ప్రాణం తీసింది?

praveen
ఇటీవల కాలం లో వెలుగు లోకి వస్తున్న కొన్ని ఘటనలను చూసిన తర్వాత మనిషి జీవితం ఇంతేనా అనే భావన ప్రతి ఒక్కరి లో కలుగుతూ ఉంది. ఎందుకంటే అంతా సంతోషం గా సాగి పోతుంది అనుకుంటున్న సమయం లో ఊహించని ఘటనలు చేసుకుని చివరికి మనిషి ప్రాణాలను ఎంతో సులభం గా తీసేస్తున్నాయ్. ఇలాంటి తరహా ఘటనలు ఇటీవల కాలంలో సోషల్ మీడియా కారణంగా కోకోళ్లలుగా వెలుగులోకి వస్తూ ఉన్నాయి. దీంతో మనిషి జీవితం ఇంతేనా అనే భావన ప్రతి ఒక్కరిలో కూడా కలుగుతుంది.

 ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు లేకుండా కుటుంబ సభ్యులతో ఎంతో సంతోషంగా గడుపుతున్నాము అనుకుంటున్న వారు చూస్తూ చూస్తుండగానే కళ్ళముందే ప్రాణాలు కోల్పోతున్నారు.  మరోవైపు ఎన్నో రకాల వైరస్లు దూసుకు వస్తూ మనిషి ప్రాణాలు తీసేస్తున్నాయి. అదే సమయంలో సడన్ హార్ట్ ఎటాక్ ల కారణంగా కేవలం సెకండ్ల వ్యవధిలో కుప్పకూలిపోయి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవలే వెలుగులోకి వచ్చిన ఘటన గురించి తెలిసిన తర్వాత మాంసం తిన్నా కూడా ప్రాణాలు పోతాయా అనే భయం అందరిలో కలుగుతూ ఉంటుంది. ఇక్కడ ఒక వ్యక్తి ఏకంగా మటన్ తింటూ తింటూ ప్రాణాలు కోల్పోయాడు.

 ఇంతకీ ఏం జరిగిందంటే.. అతని గొంతులో మటన్ ముక్క ఇరుక్కుపోవడంతో ఊపిరాడక చివరికి ప్రాణాలు వదిలాడు. ఈ విషాదకర ఘటన మహబూబాబాద్ జిల్లా కోనాపురంలో వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన ముత్తయ్య తన కొడుకు నరేష్ తో కలిసి ఇటీవల మటన్ తో  భోజనం చేశాడు.  అయితే ముత్తయ్య గొంతులో మటన్ ముక్క ఇరుక్కుంది. దీంతో ఆయన ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించిన ఫలితం లేకుండా పోయింది. చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ షాకింగ్ ఘటనతో అటు కుటుంబం మొత్తం విషాదంలో మునిగిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: