కసాయి తల్లి.. ఆడుకుంటున్న పిల్లల్ని ఇంట్లోకి తీసుకెళ్లి?

praveen
సాధారణం గా కడుపునా పుట్టిన పిల్లలను తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో ప్రత్యేకం గా చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి కష్టం రాకుండా ఇక పిల్లలు ఏది కావాలన్నా అది కొనిస్తూ ఉంటారు అని చెప్పాలి. కానీ ఇటీవల కాలం లో మాత్రం కొంతమంది ఏకంగా కుటుంబ సమస్యల నేపథ్యంలో కడుపున పుట్టిన వారిని కూడా దారుణంగా ప్రాణాలు తీస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయ్. రక్త సంబంధాన్ని, పేగు తెంచుకున్న బంధాన్ని మరిచిపోయి ప్రవర్తిస్తున్నారు కొంతమంది. ఇక్కడ ఒక మహిళ ఇలాంటిదే చేసింది. ఏకంగా కడుపున పుట్టిన పిల్లల విషయంలో కాస్త అయినా జాలి దయ చూపించలేకపోయింది.

 ఏకంగా బయట ఎంతో సంతోషంగా ఆడుకుంటున్న పిల్లలను బలవంతంగా ఇంట్లోకి తీసుకువెళ్లింది. చివరకు ఆమె కేకలు వింటూ స్థానికులు అక్కడికి పరుగులు పెట్టుకుంటూ వచ్చారు. అక్కడ జరిగిన దృశ్యం చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. రాజస్థాన్లోని బార్మర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. భార్మర్  ప్రాంతానికి చెందిన సాతారాం అనే వ్యక్తికి కూతురు కొడుకు ఉన్నారు. సాతారామ్ బస్సు డ్రైవర్ గా పనిచేస్తూ ఉంటాడు. ఈ దంపతుల మధ్య ఎలాంటి గొడవలు లేకపోవడంతో వీరి సంసారం సాఫీగాని సాగుతూ వచ్చింది. అయితే ఏమైందో ఇటీవలే కుటుంబంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది.

 రోజు లాగానే డ్యూటీకి వెళ్ళాడు సాతారామ్. పిల్లలు ఇంటి సమీపంలో పొలంలో ఆడుకుంటున్నారు. కానీ సోనీ అనుహ్య నిర్ణయం తీసుకుంది. ఆడుకుంటున్న పిల్లలను ఇంటికి తీసుకువచ్చి.. వాటర్ ట్యాంకులో పడేసింది. పిల్లలు చనిపోయారని నిర్ధారించుకున్న తర్వాత ఇంట్లోకి వెళ్లి కిరోసిన్ పోసుకొని నిప్పుటించుకుంది. కేకలు విని అక్కడికి వచ్చిన స్థానికులు జరిగిన ఘటన గురించి తెలిసి షాక్ అయ్యారు. వెంటనే సోనిని ఆసుపత్రికి తరలించగా తీవ్రమైన కాలిన గాయాలతో చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: