పార్సల్ ఓపెన్ చేస్తే మనిషి పుర్రె వచ్చింది.. ఇంతకీ ఏం ఆర్డర్ చేశాడంటే?

praveen
ఇటీవల కాలంలో ఆన్లైన్ ప్రపంచంలోనే ప్రతి మనిషి జీవనాన్ని సాగిస్తూ ఉన్నాడు. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీని అవసరానికి మించి వాడుకుంటున్నాడు మనిషి. దీంతో ఇక టెక్నాలజీపై తెగ ఆధారపడిపోతున్నాడు అని చెప్పాలి. ఒకరకంగా చెప్పాలి అంటే టెక్నాలజీని ఉపయోగించుకొని ఏకంగా సామాన్యుడు సైతం లగ్జరీ లైఫ్ ను గడపగలుగుతున్నాడు. అదెలా అంటారా.. ఒకప్పుడు సంపన్నులు మాత్రమే పని వాళ్ళని పెట్టుకుని తమకు కావలసినవి దగ్గరికి తెప్పించుకునేవారు.

 కానీ ఇప్పుడు ఆన్లైన్ ఈ కామర్స్ యాప్ కారణంగా తమకు కావాల్సిన వస్తువులను ఇంట్లో కూర్చునే దగ్గరికి తెప్పించుకుంటున్నారు. వేసుకునే చెప్పుల దగ్గర నుంచి తినే తిండి వరకు ప్రతి ఒక్కరికి కూడా ఆన్లైన్లో ఆర్డర్ పెడుతూ ఇంటి ముంగిటికే వచ్చేలా చూసుకుంటున్నారు. వెరసి ఇలా కావాల్సిన దానికంటే కాస్త ఎక్కువగానే ఆన్లైన్ యాప్స్ పై ఆధారపడుతున్నారు. అయితే ఇలా ఆన్లైన్లో ఆర్డర్లు పెట్టాలనుకునే  వారికి కొన్ని కొన్ని సార్లు ఊహించని షాక్ లు కూడా తగులుతూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే.

 ఇక్కడ ఒక వ్యక్తికి ఇలాంటి చేదు అనుభవం ఎదురయింది. తమిళనాడులో తంజావూరు జిల్లా తిరువయ్యారులో ఒక వ్యక్తికి షాకింగ్ ఘటన ఎదురైంది. మహమ్మద్ ఖాసిం అనే వ్యక్తి ఆన్లైన్లో రైస్ కుక్కర్ ని ఆర్డర్ చేశాడు. అయితే ఆర్డర్ ఇచ్చిన
 పార్సెల్ ఓపెన్ చేసి చూసిన తర్వాత ఒకసారిగా షాక్ తో కూడిన భయాందోళనకు గురయ్యాడు. ఎందుకంటే అతడు రైస్ కుక్కర్ బుక్ చేస్తే ఇక డెలివరీ అయిన పార్సెల్ లో రక్తపు మరకలతో ఉన్న మనిషి పుర్రె ఉంది. దీంతో ఒక్కసారిగా వెన్నులో వణుకు పుట్టింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివిధ కోణాలలో దర్యాప్తు చేస్తున్నారు అని చెప్పాలి. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: