తాను తెచ్చుకున్న బీర్ భార్య తాగిందని.. దారుణంగా చంపేశాడు?

praveen
ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటన చూసిన తర్వాత మనుషులు పూర్తిగా మానవత్వాన్ని మరిచి ప్రవర్తిస్తున్నారు అన్నది మాత్రం ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది. ఎందుకంటే ఒకప్పుడు సొంత వారి విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండేవారు మనుషులు. మనవాళ్లు బాగుంటే చాలు అని స్వార్థంతో ఆలోచించే వాళ్ళు. ఏ కష్టం రాకుండా చూసుకునేవారు. ఇక పరాయ వ్యక్తుల విషయంలోనే కాస్త మానవత్వం లేకుండా ప్రవర్తించేవారు. కానీ ఇటీవల కాలంలో మాత్రం సొంత వారి విషయంలో కూడా కాస్తయినా జాలీ దయ చూపించడం లేదు మనిషి. ఏకంగా కట్టుకున్న వారు.. కన్నవారు.. కడుపున పుట్టిన వారు అనే తేడా లేకుండా అవసరాల కోసం ఎవరి ప్రాణాలు అయినా తీయడానికి సిద్ధమవుతున్నాడు మనిషి.

 నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనల గురించి తెలిసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు అని చెప్పాలి. ఇటీవల తమిళనాడు రాష్ట్రంలో కూడా ఇలాంటి ఒక దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కన్నియ్య కుమారి జిల్లాలో ఒక వ్యక్తి తాను తాగేందుకు తెచ్చుకున్న మందు భార్య తాగిందన్న కోపంతో చివరికి ఆమె ప్రాణాలు దారుణంగా తీసేశాడు. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే.. ఇలా సదరు వ్యక్తి హత్య చేసింది అతని మూడో భార్యను కావడం గమనార్హం. కాగా ఇలా భార్యను హత్య చేసిన డేపురాయి పశ్చిమ బెంగాల్ కు చెందిన కార్మికుడు.

 అయితే అతని మూడో భార్య వసంతి బకాడియాతో కలిసి కట్టలై కులంలో నివాసము అంటున్నాడు. స్థానికంగా ఇటుక బట్టీల్లో పనిచేస్తూ ఉంటారు దంపతులు. అయితే ఇటీవల మద్యం తాగటం కోసం మద్యం షాప్ నుంచి ఒక బీర్ తెచ్చుకున్నాడు. అయితే అతను తెచ్చుకున్న మద్యాన్ని అతని మూడో భార్య తాగింది. ఇక కోపంతో ఊగిపోయిన అతడు కర్రతో చితక బాదడంతో చివరికి ప్రాణాలు కోల్పోయింది అతని భార్య. ఇక ఆ తర్వాత తను దొరకకుండా ఉండడానికి భార్య శరీరం మీద.. నేల మీద పడిన రక్తపు మరకలను నీళ్లతో కడిగేసాడు. ఇక ఆ సమయంలో చూసిన ఇటుక బట్టి యజమాని.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇక రంగంలోకి దిగిన పోలీసులు నిందితుని అరెస్టు చేసి విచారించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: