దేవుడా.. మహిళా కానిస్టేబుల్ కే .. ఇలాంటి పరిస్థితా?

praveen
ప్రస్తుత జనరేషన్లో అయితే ఆడపిల్ల మగపిల్లాడు అనే తేడా లేదు. అందరూ సమానమే అనే భావన తోనే ప్రతి ఒక్కరు మెలుగుతున్నారు. ఇక పురుషుల తో సమానం గా ఆడవాళ్లు కూడా అన్ని రంగాల్లో రాణిస్తూ ఉన్నారు. చదువులు ఉద్యోగాలు వ్యాపారాలు అనే తేడా లేకుండా ఇక మహిళలు కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. దీంతో మహిళలు కేవలం వంటింటి కుందేళ్లు మాత్రమే అని ఉన్న భావన ప్రతి ఒక్కరిలో కూడా తొలగి పోతోంది.

 ప్రస్తుతం నేటి రోజుల్లో ప్రతి ఒక్కరు ఇలాంటి మాటలే చెప్పుకుంటూ ఉన్నారు. కానీ ఇప్పటికీ కొన్ని విషయాల్లో మాత్రం ఆడపిల్ల పురుషుల తో పోల్చి చూస్తే దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటుంది అనేది తెలుస్తుంది. ముఖ్యంగా పెళ్లి విషయం లో అయితే ఇప్పటికే ఎంతో మంది తల్లి దండ్రులు ఇష్టం లేకుండానే ఆడపిల్లలకు మూడు ముళ్ళు వేయిస్తున్న ఘటనలు వెలుగు లోకి వస్తున్నాయ్. దీంతో ఇష్టం లేక పోయినా తల్లిదండ్రుల కోసం తలవంచుకుని పెళ్లి చేసుకుని చివరికి బలవంతం గా జీవితాన్ని నెట్టుకొస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.

 అయితే సామాన్య మహిళలకు మాత్రమే కాదు.. ఇక్కడ ఒక మహిళ పోలీస్ కానిస్టేబుల్ కి కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైంది అన్నది తెలుస్తుంది. సాధారణం గా పోలీస్ కానిస్టేబుల్ అంటే మహిళలకు ఏదైనా సమస్య వస్తే తానే ముందుండి సమస్యను పరిష్కరిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ మహిళా పోలీస్ కానిస్టేబుల్ చివరికి బలవంతం గా పెళ్లి చేసేందుకు ప్రయత్నించడం తో ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్లోని ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు లోకి వచ్చింది. సురేఖ మహిళా కానిస్టేబుల్ గా పని చేస్తుంది. ఇటీవల ఆమెకు పెళ్లి కుదరగా పెళ్లి ఇష్టం లేకపోవడంతో చివరికి ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: