రెండేళ్ల బాలుడికి పాముకాటు.. కానీ చీమ కుట్టిందనుకున్న తల్లి.. చివరికి?

praveen
ఇటీవల కాలంలో వెలుగు లోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత మృత్యువు ఎప్పుడు ఎటువైపు వస్తుంది అన్నది కూడా ఊహించలేని విధంగా మారిపోతూ ఉంది అని చెప్పాలి. ఎందుకంటే అంతా సంతోషంగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో ఎన్నో అనూహ్యమైన ఘటనలు చివరికి ప్రాణాలను తీసేస్తూ ఉన్నాయి. ఇక ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపుతూ ఉన్నాయి. ఇప్పటికే కరోనా వైరస్ ఎంతో మంది ప్రాణాలు తీయగా.. ఇప్పుడిప్పుడే వైరస్ బారి నుంచి బయట పడుతున్నామని అందరూ అనుకుంటూన్న సమయంలో సడన్ హార్ట్ ఎటాక్ లు ప్రాణాలు తీసేస్తున్నాయి.

 ఇంకొన్నిసార్లు మనుషులే చేజేతులారా ఆత్మహత్యలు చేసుకుంటూ ప్రాణాలు తీసేసుకుంటున్నారు. వెరసి ఈ ఘటనలు చూశాక ఎప్పుడు మనిషి ప్రాణం పోతుందో కూడా చెప్పలేని విధంగా మారిపోయింది పరిస్థితి. అయితే కొన్ని కొన్ని సార్లు విధి ఆడిన వింత నాటకంలో అభం శుభం తెలియని చిన్నారులు సైతం ప్రాణాలు కోల్పోవడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి ఘటనలు ఎంతోమంది హృదయాన్ని మెలిపెట్టేస్తూ ఉంటది. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది.  రోజు మాదిరిగానే రెండేళ్ల బాలుడు ఆడుకుంటున్నాడు. కానీ ఇంతలో అతను పాముకాటుకు గురయ్యాడు.

 కానీ అతనికి ఏం తెలుసు నొప్పి వేసినప్పుడు ఏడవడం తప్ప.. తనకు కరిచింది పామని.. ఆ పాము కారణంగా ప్రాణాలు పోతాయని.. అది ఎంతో ప్రమాదకరమైందని.. ఇక అభం శుభం తెలియని రెండేళ్ల బాలుడు ఇక ఏడుస్తూ ఉండడంతో ఏదో చీమ కరిసిందని తల్లిదండ్రులు అనుకున్నారు. కానీ చివరికి ప్రాణం పోయింది. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా కలవచర్లలో వెలుగులోకి వచ్చింది. రెండేళ్ల బాలుడు ఏడవడంతో చీమకుట్టిందని భావించిన తల్లి ఓదార్చి పడుకోబెట్టింది. కొంతసేపటికి నోటి నుంచి నురగ రావడంతో ఆసుపత్రికి తరలించగా  చికిత్స చేసిన బాలుడి ప్రాణాలను కాపాడలేకపోయారు వైద్యులు. దీంతో ఆ తల్లిదండ్రులు అరణ్య రోదనగా విలపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: