అమ్మాయిల స్కర్ట్ వేసుకున్న అబ్బాయిలు.. మెట్రో ట్రైన్ లో ఏం చేశారంటే?

praveen
ఇటీవల కాలంలో ఢిల్లీ మెట్రో తరచూ ఏదో ఒక విషయంతో వార్తలో హాట్ టాపిక్ గా మారిపోతూనే ఉంది అన్న విషయం తెలిసిందే. ఢిల్లీ మెట్రోలో ఎంతోమంది ప్రయాణికులు తోటి ప్రయాణికులతో అనుచితంగా ప్రవర్తిస్తున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయ్. ఇది ఇలా ఉంటే ఇక ఇటీవల కాలంలో ఎంతోమంది అటు ఢిల్లీ మెట్రోని సోషల్ మీడియాలో పాపులారిటీ కావడం కోసం ఉపయోగించుకుంటున్నారు. ఎక్కడ ప్లేస్ దొరకలేదు అన్నట్టుగా ఢిల్లీ మెట్రో రైల్ లేదా మెట్రో స్టేషన్లలో వీడియోలు తీసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం చేస్తున్నారు.

 ఇలా మెట్రో రైల్లో కొంతమంది డాన్స్ లు చేసి ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటే.. మరి కొంతమంది విచిత్రమైన వేషధారణతో మెట్రో ట్రైన్ లో కనిపిస్తూ ప్రాంక్ లు చేస్తూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వీడియోనే ఒకటి వైరల్ గా మారిపోయింది. ఇది చూసి నెటిజెన్స్ అందరు కూడా పగలబడి నవ్వుకుంటున్నారు అని చెప్పాలి. ఇద్దరు యువకులు రొటీన్ కు భిన్నంగా స్కర్ట్ ధరించి మెట్రోలో ప్రయాణించిన ఫోటోలు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం వైరల్ గా మారిపోయాయి. ఆ ఇద్దరు యువకులు లుంగీ అనుకున్నారో లేకపోతే స్కర్ట్ వేసుకోవాలని ఉద్దేశంతోనే ఉన్నారో తెలియదు. కానీ అమ్మాయిలు వేసుకునే స్కర్ట్ లతో మెట్రో రైల్ ఎక్కారు.

 దీంతో వారిని చూసి ఇక మిగతా ప్రయాణికులు అందరూ కూడా ఒక్కసారిగా అవాక్కయ్యారు అని చెప్పాలి. కొంతమంది వారు చేసిన పని చూసి పగలబడి నవ్వుకున్నారు. ఇక వీరి వీడియో వైరల్ గా మారిపోగా.. ఎంతో మంది నేటిజన్స్ దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ వీడియో పై ఎంతోమంది భిన్నంగా స్పందిస్తున్నారు అని చెప్పాలి. లుంగీ అనుకుని స్కర్ట్ ధరించారేమో అని కొంతమంది కామెంట్లు చేస్తూ ఉంటే.. స్కర్ట్ లు అమ్మాయిలే ధరించాలని ఏమైనా రూల్ ఉందా సౌకర్యంగా ఉంటే అబ్బాయిలు కూడా వేసుకోవచ్చు అంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: