స్కర్ట్ వేసుకుని వచ్చి.. మెట్రోలో యువతి పిచ్చి చేష్టలు?

praveen
ఇటీవల కాలంలో జనాలను ట్రాఫిక్ కష్టాల నుంచి బయటపడేసేందుకు  కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు మెట్రోని అందుబాటులోకి తీసుకువచ్చాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ మెట్రో ద్వారా ఎంతో మంది ట్రాఫిక్ లేని ప్రయాణాన్ని సాగిస్తూ ఉన్నారు. కాస్త ధర ఎక్కువైన ఇక ట్రాఫిక్ తో వచ్చే  చికాకు కోపంలేని ప్రయాణం కావడంతో ఇక అందరూ మెట్రోని ఆశ్రయిస్తూ ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో మెట్రో కేవలం ప్రయాణాలకు మాత్రమే కాదు సోషల్ మీడియాలో పాపులారిటీ అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది అన్నది మాత్రం ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న కొన్ని వీడియోలు చూసిన తర్వాత అర్థమవుతుంది.

 ముఖ్యంగా ఢిల్లీ మెట్రోలో ఇలాంటి తరహా ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయ్. సాధారణంగా ఢిల్లీ మెట్రో ఎంత రద్దీగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటి ఢిల్లీ మెట్రోలో కొంతమంది సోషల్ మీడియాలో పాపులారిటీ కావడం కోసం చిత్ర విచిత్రమైన పనులు చేస్తూ ఉన్నారు. ఇక ఇటీవల ఒక యువతి ఇలాంటిదే చేసింది. ఏకంగా ఢిల్లీ మెట్రో ట్రైన్ లో డాన్స్ చేసి ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. అయితే ఇలా కొంతమంది ప్రయాణికులు చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తున్న ఘటనలు ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తున్నప్పటికీ అవేవీ  పట్టించుకోకుండా జనాలు మెట్రోలో హద్దులు మీరిపోతున్నారు.

 దీన్ని బట్టి చూస్తే కేవలం ప్రయాణాలకు మాత్రమే కాదు ఎంతో మందికి పాపులారిటీ రావడానికి కూడా మెట్రో ఉపయోగపడుతుంది అన్నది మాత్రం అర్థం అవుతుంది. ఇకపోతే ఇటీవలే ఒక స్కర్ట్ వేసుకొని యువతి మెట్రోలో డాన్స్ చేసింది. ఈ వీడియో వైరల్ గా మారగా.. నేటిజన్స్  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వీడియో పోస్ట్ చేసిన తర్వాత మరో వీడియోని కూడా తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది యువతి. మెట్రోలో డాన్స్ చేయడానికి అనుమతి లేదని తెలుసు. కానీ మొదటిసారి ఢిల్లీ మెట్రోలో ఇలా ట్రై చేస్తానని చెబుతూ.. ఆ యువతి మరో వీడియోను పోస్ట్ చేయగా ఇది వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: