వైరల్ : యువతిని రేప్ చేయబోయాడు.. కానీ కట్ చేస్తే?

praveen
ఇటీవల కాలం లో ఎక్కడ చూసినా ఆకతాయిలు రెచ్చి పోతున్నారు అన్న విషయం తెలిసిందే . ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్గా చేసుకుని దారుణం గా వేధింపులకు పాల్పడుతున్న ఘటనలు ఎన్నో వెలుగు లోకి వస్తున్నాయి. అయితే మహిళలపై వేధింపులకు పాల్పడిన వారిని శిక్షించేందుకు కఠిన చట్టాలను తీసుకువచ్చినప్పటికీ అటు కామాంధులు తీరు లో మాత్రం మార్పు రావడం లేదు.

 ఒంటరిగా ఆడపిల్ల కనిపించింది అంటే చాలు మనుషుల్లో ఉన్న మానవత్వం మంట కలిసి పోయి మానవ మృగం బయటికి వచ్చేస్తుంది. దీంతో దారుణం గా అమ్మాయిలను వేధింపులకు గురిచేస్తున్నారు. కొంతమంది అయితే అత్యాచారం చేసి దారుణంగా ప్రాణాలు తీస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. రోడ్డుపై ఒంటరిగా నడుచుకుంటూ వెళుతున్న ఒక యువతిని లోబరుచుకోవాలని ప్రయత్నించాడు ఒక కామాంధుడు. ఈ క్రమంలోనే మొహం మీద ముద్దు పెడుతూ ఇక ప్రైవేట్ పార్ట్స్ ను తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు.

 అయితే సదరు యువతీ తీవ్రంగా ప్రతికటించింది. దీంతో కోపంతో దాడి చేసేందుకు కూడా ప్రయత్నించాడు. అయితే ఇదంతా జరుగుతుండగానే ఒక బస్సు అక్కడికి వచ్చింది. అక్కడ జరుగుతున్న విషయాన్ని పట్టించుకోకుండానే బస్సు కాస్త ముందుకు కదిలింది. కానీ అందులో ఉన్న ప్రయాణికులు మాత్రం బస్సు ఆపి కిందికి దిగి వచ్చి ఆడపిల్లను ఏడిపిస్తున్న ఆకతాయికి బుద్ధి చెప్పారు. దారుణంగా చితక బాదారు.  ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది . అమ్మాయిని ఏడిపించిన కామాంధుడికి అక్కడున్న బస్సులోని ప్రయాణికులు సరిగ్గా బుద్ధి చెప్పారు అంటూ నేటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. అయితే ఈ వీడియో పోలీసుల దృష్టికి వెళ్ళింది అన్నది తెలుస్తుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇక నిందితుడు ఎవరో అని కనుక్కునే పనిలో పడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: