ఇల్లరికం వచ్చాడు.. కానీ అలా జరగడంతో ఉరేసుకున్నాడు?

praveen
అప్పుడెప్పుడో శ్రీశ్రీ చెప్పారు.. అగ్గిపుల్ల.. సబ్బు బిల్లా.. కాకి పిల్ల కవితకు కాదేది అనర్హమని. అయితే ఇప్పుడు జనాలు మాత్రం దీనిని కాస్త వెరైటీగా అర్థం చేసుకున్నారేమో అని అనిపిస్తూ ఉంటుంది. ఆత్మహత్యకు కాదేది అనర్హం అన్న విధంగా నేటి రోజుల్లో జనాలు వ్యవహరిస్తూ ఉన్నారు. చిన్న సమస్య వచ్చినా పెద్ద సమస్య వచ్చినా... తల్లిదండ్రులు మందలించిన టీచర్ హోంవర్క్ చేయమన్న.. లేకపోతే స్నేహితులతో గొడవ జరిగిన లేదంటే పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చిన ఇలా కారణం ఏదైనా సరే అన్నింటికీ పరిష్కారం ఒక్కటే ఆత్మహత్య అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు జనాలు.

 వెరసి దేవుడు ఇచ్చిన విలువైన ప్రాణాలను మనుషులే చేజేతులారా బలవంతంగా తీసుకుంటున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. ఇలా క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగానే ముగిస్తున్నారు ఎంతోమంది. ఇలాంటి తరహా ఘటనలు ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపుతూ ఉన్నాయి అని చెప్పాలి.  ఇక్కడ ఒక వ్యక్తి ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకొని చివరికి బలవన్మరణానికి పాల్పడ్డాడు.  సంతోషం లేదు పాడు లేదు.. ఇక నా జీవితం ఇంతే అని విరక్తి  చెందిన వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఈ విషాదకర ఘటన మెదక్ జిల్లాలోని చేగుంట మండలం చిన్న శివనూరులో వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సుంచు బాబు అనే 28 ఏళ్ల యువకుడికి ఉల్లితిమ్మాయి పలికి చెందిన అర్చనతో వివాహం జరిగింది. అయితే వివాహం అనంతరం బాబు ఇల్లరికం వచ్చాడు. అయితే కొన్నాళ్లపాటు వీరి కాపురం సజావుగానే సాగింది. కానీ ఆ తర్వాత భార్యాభర్తల మధ్య విభేదాలు రావడం మొదలైంది. ఈ క్రమంలోనే భార్యకు దూరంగా శివ నూరుకు వెళ్లి అక్కడే జీవిస్తున్నాడు బాబు. అయితే ఒంటరితనాన్ని తట్టుకోలేకపోయాడు. ఇకజీవితంపై ఆశ కోల్పోయాడు. ఇక నా తన జీవితం ఇంతే అని విరక్తి చెంది సూసైడ్ చేసుకున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: