ఐపీఎల్ బెట్టింగ్ తో అప్పుల పాలు.. చివరికి విద్యార్థి ఏం చేశాడంటే?

praveen
ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమైంది. ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా ఈ లీగ్ లోని ప్రతి మ్యాచ్ వీక్షిస్తూ అసలు సిస్థలైన ఎంటర్టైన్మెంట్ పొందుతున్నాడు. కొంతమంది స్టేడియం కు వెళ్లి మ్యాచ్ వీక్షిస్తే మరి కొంత మంది టీవీల ముందు కూర్చుని మ్యాచ్ మజాని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలో క్రికెట్ ని ఎంజాయ్ చేయడం మానేసి కొంతమంది మాత్రం ఐపీఎల్ మ్యాచ్లపై భారీగా డబ్బులు సంపాదించాలని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఐపీఎల్ మ్యాచ్ల పై బెట్టింగ్లు పెట్టడానికి ఎక్కువగా ఆసక్తి కనబరుస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే.

 అయితే ఇలా బెట్టింగుల ద్వారా కొంతమంది భారీగా డబ్బు సంపాదిస్తూ ఉంటే మరి కొంతమంది మాత్రం ఉన్నదంతా పోగొట్టుకొని రోడ్డున పడే పరిస్థితిని కొని తెచ్చుకుంటున్నారు అని చెప్పాలి. కొంతమంది ఇలా బెట్టింగ్లతో అప్పులు చేసి చివరికి అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకుంటున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఇక ఇటీవలే అనకాపల్లిలో కూడా ఇలాంటి తరహా ఘటన వెలుగు చూసింది. క్రికెట్ బెట్టింగ్ కోసం చేసిన అప్పులు తీర్చలేక డిగ్రీ విద్యార్థి కఠిన నిర్ణయం తీసుకున్నాడు. కని పెంచిన తల్లిదండ్రుల గురించి ఆలోచించకుండా చివరికి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

 అనకాపల్లి జిల్లా దిబ్బపాలెం గ్రామానికి చెందిన నర్సింగరావు, జయ దంపతుల కుమారుడు 20 ఏళ్ల మధు కుమార్ అనకాపల్లిలోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతున్నాడు. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ బెట్టింగ్లో పాల్గొన్నాడు సదరు విద్యార్థి. ఇందుకోసం గ్రామానికి చెందిన ఒక వ్యక్తి వద్ద అప్పు చేశాడు. అయితే అప్పు తీర్చమని ఒత్తిడి రావడంతో అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు. దీంతో ఇటీవల ఎలకల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా చివరికి చికిత్స పొందుతూ ఇటీవలే మరణించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: