ఆరేళ్ల ప్రేమ.. ఒకరి పేరు మరొకరు టాటూ.. కానీ?

praveen
ఇటీవల కాలం లో వెలుగు లోకి వస్తున్న ఘటనలు చూస్తున్న తర్వాత ప్రేమ అనేది మధురానుభూతులకు చిరునామాగా కాదు.. నయవంచనకు కేరాఫ్ అడ్రస్ గా మారి పోయింది అని చెప్పాలి. ఇక అవసరాలు తీర్చు కోవడం కోసం ప్రేమ అనే ముసుగు వేసుకుంటున్న ఎంతో మంది మోసగాళ్లు చివరికి అమ్మాయిల జీవితాలతో ఆటలు ఆడుతున్న ఘటనలు ఎన్నో వెలుగు లోకి వస్తున్నాయి. ఇలా ప్రేమించాము అని చెప్పిన అబ్బాయిని గుడ్డిగా నమ్ముతున్న అమ్మాయిలు.. చివరికి మోసపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు కూడా కోకోళ్లలు అని చెప్పాలి.

 అయితే కొంతమంది అమ్మాయిలు ఇలా ప్రియుడు చేతిలో మోసపోయి ఆత్మహత్య చేసుకుంటుంటే.. మరి కొంతమంది మాత్రం న్యాయపోరాటం చేస్తూ ఏకంగా ప్రియుడు ఇంటి ముందు ధర్నా చేస్తున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. కామారెడ్డి జిల్లా తుజాల్పూర్ లో ఘటన చోటుచేసుకుంది. ఆరేళ్లపాటు ఆ యువతీ యువకులు ఇద్దరు ప్రేమించుకున్నారు. ఇక ఒకరి పేరును ఒకరు టాటూ కూడా వేయించుకున్నారు. కానీ యువకుడు ముఖం చాటేసాడు. దీంతో మోసపోయాను అని గ్రహించిన యువతి ప్రియుడి ఇంటి ఎదుట బయట నుంచి నిరసన తెలిపింది.

 దోమకొండకు చెందిన మెతుకు మౌనిక డిగ్రీ చేస్తున్న సమయం లోనే తుజాల్పూర్ గ్రామానికి చెందిన నాగరాజు గౌడ్ తో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్తగా ప్రేమగా మారింది. ఆరేళ్ల నుంచి వీరిద్దరూ ప్రేమ లో మునికి తేలారు. ఒకరి పేరును మరొకరు టాటూలు కూడా వేసుకున్నారు. పెళ్లి చేసుకుంటానని గుడ్డిగా మౌనికను నమ్మించాడు నాగరాజు. తీరా ఇప్పుడు పెళ్లి చేసుకోమని అడగడం తో నిరాకరించడమే కాకుండా దుర్భాషలాడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తుంది బాధితురాలు. పోలీసులకు ఫిర్యాదు చేసిన.. పెళ్ళి చేసుకునేందుకు ఒప్పుకోలేదని అందుకే అతని ఇంటి ముందు నిరసనకు దిగినట్లు చెబుతుంది. న్యాయం చేయాలంటూ కోరుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: