మస్కిటో కాయిల్.. ప్రాణం తీసేసింది?

praveen
మనిషి జీవితం గ్యారెంటీ లేనిది అన్న విషయం అందరికీ తెలుసు. ఎందుకంటే ఒకసారి తల్లి కడుపు నుండి ఈ భూమికి వచ్చిన తర్వాత ఇక ఎప్పుడూ మరణం సంభవిస్తుంది అన్నది కూడా ఊహకందని విధంగానే ఉంటుంది అని చెప్పాలి. అయితే మనిషి జీవితం గ్యారెంటీ లేనిది అన్న విషయం మాత్రం నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి మరింత స్పష్టంగా అర్థం అవుతుంది. అంత సాఫీగా ఉంది అనుకుంటున్న సమయంలో ఏ క్షణంలో ఎటువైపు నుంచి మృత్యువు దూసుకు వచ్చి ప్రాణాలు తీస్తుంది అన్నది కూడా ఊహకందని విధంగానే ఉంది అని చెప్పాలి.

 వెరసి ఇక ఎప్పుడు ప్రాణం పోతుందో కూడా తెలియదు కాబట్టి మనిషి ప్రతిక్షణం భయపడుతూనే బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇక్కడ ఇలాంటి ఘటనే జరిగింది అని చెప్పాలి. సాధారణంగా ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నాయి అనుకోండి ఎవరైనా సరే దోమల నివారణకు ఇంట్లో మస్కిటో కాయిల్ వాడటం చేస్తూ ఉంటారు. ఇది ప్రతి ఇంట్లోనూ జరిగేదే. కానీ ఇలా మస్కిటో కాయిల్ కారణంగానే చివరికి ప్రాణం పోతుంది అంటే ఎవరైనా నమ్ముతారా. మస్కిటో కాయిల్ తో ప్రాణం పోవడం ఏంటి నమ్మశక్యంగా  లేదే అని అంటారు అందరూ.

 కానీ ఇక్కడ మాత్రం ఇదే జరిగింది అని చెప్పాలి. చిత్తూరు జిల్లా మర్లపల్లికి చెందిన నిరంజన్ అనే వ్యక్తి మస్కిటో కాయిల్ కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. ఇంట్లో దోమలు ఉన్నాయని మస్కిటో కాయిల్ అంటించి నిద్రపోయాడు. అయితే కాయిల్ నిప్పు ఇంట్లోనే వస్తువులు అంటుకొని మంటలు చెలరేగగా.. పొగ వస్తుందని స్థానికులు పోలీసులకు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వాళ్లు వచ్చి మంటలు ఆర్పి లోపలికి వెళ్ళగా అప్పటికే నిరంజన్ చనిపోగా మృతదేహం సగం  కాలిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: