సెల్ఫోన్ టవర్ ఎక్కిన యువతి.. ఎందుకో తెలుసా?

praveen
సాధారణం గా ప్రతి మనిషి జీవితం లో కష్టాలు ఎలా ఉంటాయో సుఖాలు కూడా అలాగే ఉంటాయి. ఇలా కష్టసుఖాలని ఎదుర్కొంటూనే ప్రతి మనిషి జీవితం లో ముందుకు సాగాల్సి ఉంటుంది అని చెప్పాలి. కానీ కొంతమంది మాత్రం కష్టాలను ధైర్యంగా ఎదుర్కోలేక పోతున్నారు. దేవుడా మాకే ఎందుకు ఇన్ని కష్టాలు ఇస్తున్నావు అని మనస్తాపం చెంది చివరికి బలవన్మరణాలకు పాల్పడుతూ ఉన్నారు అని చెప్పాలి. వెరసి ఇటీవల కాలంలో ప్రతి సమస్యకి పరిష్కారం కేవలం సూసైడ్ ఒక్కటే అన్న విధంగా మనిషి ఆలోచన తీరు మారిపోయింది అన్నది అర్థమవుతుంది.

 మరి ముఖ్యంగా ప్రేమ అనే వ్యవహారం ప్రాణాలు పోవడానికి కారణం అవుతుంది అని చెప్పాలి. ప్రేమించిన వారు మోసం చేశారు అనే కారణంతో ఎంతోమంది బలవన్మరణాలకు పాల్పడుతున్న ఘటనలు కోకోళ్లలుగా వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ ఇలాంటిదే జరిగింది అని చెప్పాలి. ఇప్పుడు వరకు ఏకంగా భార్య కాపురానికి రావడం లేదని లేదంటే ప్రియురాలు మోసం చేసిందని ఎంతోమంది యువకులు సెల్ఫోన్ టవర్ ఎక్కి సూసైడ్ చేసుకుంటాము అంటూ బ్లాక్ మెయిల్ చేసిన ఘటనలు ఎన్నోసార్లు వెలుగులోకి వచ్చాయి.  కానీ మొదటిసారి ప్రియుడి కోసం ఒక యువతి సెల్ఫోన్ టవర్ ఎక్కింది.

 తనను కాదని మరో మహిళను పెళ్లి చేసుకున్న ప్రియుడుతో తనకు పెళ్లి చేసి న్యాయం చేయాలి అంటూ డిమాండ్ చేస్తూ ఒక యువతి సెల్ఫోన్ టవర్ ఎక్కింది. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లా మదనాపురం మండలంలో వెలుగులోకి వచ్చింది.  రామన్ పాడ్ లో ఈ ఘటన జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని.. సముదాయించే ప్రయత్నం చేసిన యువతి వినిపించుకోలేదు. ఇక ఐదు గంటల పాటు సెల్ఫోన్ టవర్ పైనే ఉండిపోయింది. ఇక ఆమెను బలవంతంగా తాళ్లతో కట్టి కిందకు దింపి ఆసుపత్రికి తరలించారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: