ఎడమ కాలికి సమస్య ఉంటే.. కుడి కాలికి ఆపరేషన్.. చివరికి?

praveen
కరోనా వైరస్ ప్రభావం తర్వాత వైద్యులు అంటే కఠిన పరిస్థితుల్లో ప్రాణాలను నిలబెట్టే ప్రత్యక్ష దైవాలు అని నమ్మడం మొదలుపెట్టారు జనాలు. అంతేకాదు ఇక వైద్యులకు అమితమైన గౌరవం ఇవ్వడం కూడా స్టార్ట్ చేశారు అని చెప్పాలి. కారణం కరోనా వైరస్ కాలంలో తాము ప్రాణాలతో ఉంటే సరిపోతుంది. ఎదుటి వాళ్ళు ఎటు పోతే మాకెందుకు అని అందరూ స్వార్థంగా ఆలోచించిన సమయంలో.. ఏకంగా వైద్యులు తమ ప్రాణాలను పణంగా పెట్టి మరీ కరోనా వైరస్ బారిన పడిన వారికి చికిత్స అందించి ఎన్నో ప్రాణాలను నిలబెట్టారు అని చెప్పాలి.

 ఇలా కరోనా వైరస్ పోరాటంలో ప్రజలకు సేవ చేస్తూ చివరికి ఆ వైరస్ బారినపడి బలైన డాక్టర్లు కూడా చాలామంది ఉన్నారు. ఇక డాక్టర్లు చేసిన సేవ గురించి తెలిసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా వైద్యులను అమితంగా గౌరవించడం మొదలుపెట్టారు. కానీ ఇటీవల కాలంలో కొంతమంది వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరు మాత్రం వైద్య వృత్తికే కళంకం తెచ్చే విధంగా ఉంది అని చెప్పాలి. ఏకంగా ఇక్కడ ఇలాంటిదే జరిగింది. ఎడమ కాలికి సమస్య ఉందని వెళ్తే  కుడి కాలికి ఆపరేషన్ చేశారు డాక్టర్లు . ఇక ఆ తర్వాత అసలు విషయం తెలిసి మళ్ళీ ఎడమ కాలికి సర్జరీ చేశారు. ఈ ఘటన తెలంగాణలోని హైదరాబాద్ నగరంలో వెలుగులోకి వచ్చింది.

కాగా ఇద్దరు ప్రైవేట్ వైద్యులకు గుర్తింపును రాష్ట్ర వైద్య మండలి రద్దు చేసింది. కరణ్ ఎం పాటిల్ అనే వైద్యుడు గుర్తింపును ఆరు నెలల పాటు.. సిహెచ్ శ్రీకాంత్ అనే మరో వైద్యుడి  సర్టిఫికెట్ను మూడు నెలల పాటు రద్దు చేస్తూ తెలంగాణ రాష్ట్ర వైద్య మండల చైర్మన్ రాజలింగం ఉత్తర్వులు జారీ చేశారని చెప్పాలి. ఇక వీరికి సంబంధించిన సర్టిఫికెట్లను రాష్ట్ర వైద్య మండలికి అందజేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఎడమ కాలికి ఆపరేషన్ చేయాల్సి ఉండగా కుడికాలికి  ఇద్దరూ వైద్యులు ఆపరేషన్ చేశారు. తర్వాత అసలు విషయం తెలిసి ఎడమకాలికి ఆపరేషన్ నిర్వహించారు. బాధితులు డిఎంహెచ్వో కి ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టి తప్పుడు వైద్యం చేసిన వైద్యులపై చర్యలు తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: