భారీ ఆస్తులు ఉన్నా.. ఆ ఊరీ అబ్బాయిలు మాకొద్దంటున్న అమ్మాయిలు?

praveen
ఇటీవల కాలంలో పెళ్లి అనేది కమర్షియల్ ఎలిమెంట్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ఎలా అయితే అబ్బాయిలు తమకు భారీగా కట్నం ఇచ్చే అమ్మాయి దొరకాలని భావిస్తూ ఉన్నారో.. అటు అమ్మాయిలు కూడా మంచి బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్న వరుడు దొరికితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు అని ఫ్యూచర్ ప్లాన్స్ వేసుకుంటున్నారు. ఇక ఇలా బాగా డబ్బున్న అబ్బాయిలు దొరికారు అంటే చాలు ఇక పెళ్ళికి రెడీ అని చెప్పేస్తున్నారు అమ్మాయిలు. కానీ ఇక్కడ మాత్రం అలా జరగడం లేదు.

 లక్షల రూపాయల ఆదాయం ఉన్న కూడా అక్కడ అబ్బాయిలను పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకు రావడం లేదు అని చెప్పాలి. ఇక ఆ గ్రామం పేరు ఎత్తితేనే అందరీ ముఖాలు మాడిపోతున్నాయి. దీంతో విసుగెత్తిపోయిన ఆ ఊరి జనం గ్రామాన్ని వదిలి పక్క గ్రామాలకు వెళ్ళిపోతున్నారు. రాజస్థాన్లోని ఉదయపూర్ జిల్లాలో ఉన్న పీపాడు గ్రామంలో ఇలాంటి పరిస్థితి నెలకొంది. ఆ ఊరిలో అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ ఇంటర్నెట్ సౌకర్యం మాత్రం లేదు అని చెప్పాలి. అయితే మొబైల్ కంపెనీలు సెల్ టవర్ ఏర్పాటు చేశాయి.  కానీ అవి గ్రామస్తులకు ఎక్కడ ఉపయోగపడటం లేదు.

 కారణం ఆ గ్రామం భౌగోళిక  స్వభావమే అని చెప్పాలి. లోతట్టు ప్రాంతంలో ఉన్న ఈ గ్రామానికి సెల్ఫోన్ సిగ్నల్ ఉండదు. దీంతో ఆ గ్రామస్తులకు ఇంటర్నెట్ సౌకర్యం అనేది లేకుండా పోయింది అని చెప్పాలి. పరిస్థితి ఎంత దారుణంగా మారింది అంటే రేషన్ షాప్ డీలర్లు సైతం తమ వద్ద ఉన్న పి ఓ ఎస్ పరికరాలు ఉపయోగించుకునేందుకు సమీపంలోని గుట్టపైకి ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. గ్రామీణ ఉపాధి హామీ పథకం లబ్ధిదారులు కూడా రోజువారి హాజరు వేసుకునేందుకు గుట్ట ఎక్కకు తప్పడం లేదు. ఇలా ఇంటర్నెట్ సదుపాయం లేని ఆ గ్రామంలోని అబ్బాయిలను పెళ్లి చేసుకునేందుకు అమ్మాయిలు అస్సలు ఇష్టపడటం లేదు. లక్షలు సంపాదిస్తున్న అలాంటి గ్రామానికి కోడలుగా అస్సలు వెళ్ళబోము అంటూ తెగేసి చెబుతున్నారు. పెళ్లయిన వారు భర్తలను తీసుకొని వేరే ప్రాంతాలకు వెళుతూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: