పెళ్లికి ఒక్కరోజు ముందు.. వరుడు అలా చేయడంతో.. పెళ్లి క్యాన్సిల్?

praveen
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మధురమైన ఘట్టం అన్న విషయం తెలిసిందే . ఇక ఇలా కొత్త భాగస్వామిని జీవితంలోకి ఆహ్వానించే క్షణాల కోసం ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు అని చెప్పాలి. కానీ ఇలా కోటి ఆశలతో దాంపత్య బంధం లోకి అడుగుపెడుతున్న సమయంలో అనుకోని కారణాలతో పెళ్లి ఆగిపోతే ఇక ఆ బాధ వర్ణనాతీతంగా ఉంటుంది అని చెప్పాలి. ఇక్కడ ఒక యువకుడికి ఇలాంటిదే జరిగింది. అయితే అతను చేసిన నిర్వాకం కారణంగానే చివరికి పెళ్లి ఆకపోవడం గమనార్హం.  హైదరాబాద్ నగరంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. జూబ్లీహిల్స్ లో ఉంటున్న యువతికి చిత్తూరు జిల్లాకు చెందిన తేజ స్వీట్స్ అధినేత, ఫైనాన్స్ వ్యాపారి అయినా రవి బాబు కుటుంబ సభ్యులకు పరిచయం ఏర్పడింది.

 దీంతో రవిబాబు కుమారుడు వైష్ణవ్ కు ఆ యువతిని ఇచ్చి పెళ్లి చేసేందుకు పెద్దలు నిశ్చయించారు. ఈ క్రమంలోనే అమ్మాయి కుటుంబ సభ్యులు మూడు కోట్ల రూపాయల వరకట్నంగా ఇచ్చేందుకు అంగీకరించారు అని చెప్పాలి. అయితే గత ఏడాది తిరుపతిలో తాజ్ హోటల్లో ఎంగేజ్మెంట్ ఏర్పాటు చేసినప్పటికీ చివరి క్షణాల్లో ఎంగేజ్మెంట్ వైష్ణవ్ కుటుంబ సభ్యులు రద్దు చేశారు. ఇక తర్వాత ఎంగేజ్మెంట్ లేకుండానే పెళ్లి తంతు జరిపించాలని పెద్దలు నిర్ణయించారు.

 ఈ క్రమంలోనే ఇటీవలే పెళ్లి తంతు నిర్వహించాలని మొయినాబాద్ లోని బ్రౌన్ షార్ట్ రిసార్ట్ లో అని ఏర్పాట్లు చేశారు. ఇక సంగీత్ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు డాన్స్ రిహార్సల్స్ చేసేందుకు పెళ్ళికొడుకు తో పాటు అతని బంధువులు స్నేహితులు రిసార్ట్ కు వచ్చారు. అయితే మహిళా కొరియోగ్రాఫర్తో కలిసి డాన్స్ చేస్తున్న వైష్నవ్ ఆమెతో పాటు అక్కడున్న ఇతర మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. అప్పటికే అతను మద్యం మత్తులో  ఉన్నాడు. ఇది చూసిన పెళ్లికూతురు అతని నిలదీసింది. దీంతో మద్యం మత్తులో  ఉన్న వైష్ణవ్  పెళ్లికూతురుతో దుర్భాషలాడుతూ ఆమెపై దాడి చేశాడు. మాట మాట పెరగడంతో ఇరు వర్గాల మధ్య  పెద్ద గొడవ జరిగింది.చివరికి వైష్ణవ్ డ్రగ్స్ కి మద్యానికి బానిసగా మారాడు అన్న విషయం తెలిసిన యువతి పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: