దారుణం : మూడు నెలల పసికందుకు.. ఉరివేసిన తల్లిదండ్రులు?

praveen
ఇటీవల కాలంలో ఆత్మహత్య చేసుకోవడం అనేది ఏకంగా చాక్లెట్ తిన్నంత  ఈజీగా మారిపోయింది. ఎలాంటి సమస్య వచ్చినా దానికి పరిష్కారం ఒకటే ఆత్మహత్య అన్నట్లుగా మనిషి ఆలోచన తీరు కూడా మారిపోయింది అని చెప్పాలి. ఏ సమస్య వచ్చినా ధైర్యంగా నిలబడి ఎదుర్కోవాల్సిన మనిషి చిన్న చిన్న సమస్యలకే కుంగిపోతూ అక్కడితో జీవితం ముగిసిపోయింది అని తెగ బాధ పడిపోతున్నాడు. దీంతో ఇక ఆత్మహత్య ఒకటే శరణ్యమని భావించి దేవుడు ఇచ్చిన విలువైన ప్రాణాలను బలవంతంగా తీసుకుంటున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తూ ఉన్నాయి అని చెప్పాలి.

 ఏకంగా కొంతమంది తల్లిదండ్రులు అయితే కడుపున పుట్టిన పిల్లల ప్రాణాలు తీసి ఇక వారు కూడా ఆత్మహత్య చేసుకుంటున్నారు. క్షణికావేషంలో తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా ఇక ఎన్నో కుటుంబాల్లో విషాదం నిండిపోతుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇలాంటి తరహా ఘటనలు ఇటీవల కాలంలో కోకోల్లలుగా వెలుగులోకి వస్తున్నాయి  ఇక ఇప్పుడు ఇలాంటి ఒక విషాదకర ఘటనే వెలుగు చూసింది అని చెప్పాలి. ఏకంగా సొంత బిడ్డకే ఉరివేసిన తల్లిదండ్రులు తర్వాత వారు కూడా ఆత్మహత్య చేసుకున్నారు.

 ఈ ఘటన ఎక్కడో కాదు తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలోని వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. చేవెళ్ల మండలంలోని దేవరపల్లి కి చెందిన అశోక్  అనే 30 ఏళ్ల వ్యక్తికి అంకిత అనే భార్యతో పాటు ఇక మూడు నెలల కూతురు కూడా ఉంది. కూతురు పుట్టింది అని వాళ్ళు ఎంతగానో సంతోష పడిపోయారు. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో ఇటీవల షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా మూడు నెలల పసికందుకు ఉరివేసి చంపేశారు. ఇక ఆ తర్వాత తల్లిదండ్రులకు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ కుటుంబం ఎందుకు ఆత్మహత్య చేసుకుంది అనే విషయంపై ఇక దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: