పెళ్లికి హోం థియేటర్ గిఫ్ట్.. ఓపెన్ చేస్తే వరుడి ప్రాణం పోయింది?

praveen
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ప్రత్యేకమైనది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తమకు నచ్చిన భాగస్వామినీ తమ జీవితంలోకి ఆహ్వానించి జీవితాంతం ఎంతో సంతోషంగా ఉండాలని ప్రతి ఒక్కరు భావిస్తూ ఉంటారు. ఇది ఇలా ఉంటే సాధారణంగా పెళ్లి జరిగినప్పుడు ఇక పెళ్ళికి హాజరైన బంధుమిత్రులందరూ కూడా నూతన మధువరులకు ఏదో ఒకటి బహుమతి ఇవ్వడం లాంటివి చేస్తూ ఉంటారూ. ఎవరికి తోచిన విధంగా వారు బహుమతులను తెచ్చి ఇక నూతన వధూవరులకు ఇచ్చి ఫోటోలకు ఫోజులు ఇస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక్కడ కూడా బంధు మిత్రులందరరూ ఇదే చేశారు. కానీ ఇలా పెళ్లికి వచ్చిన ఒక గిఫ్ట్ ఏకంగా మరునాడే వరుడి ప్రాణం పోవడానికి కారణమైంది అని చెప్పాలి.

 ఈ ఘటన ఛత్తీస్గడ్లో వెలుగులోకి వచ్చింది. కబీర్ ధామ్ జిల్లాలో చోటు చేసుకుంది అని చెప్పాలి. పెళ్లికి వచ్చిన బంధుమిత్రులు ఏకంగా నూతన వధూవరులకు ఒక హోం థియేటర్ గిఫ్టుగా ఇచ్చారు. ఈ క్రమంలోనే ఆ హోమ్ థియేటర్ను ఓపెన్ చేయగా అది ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ఘటనలో పెళ్ళికొడుకుతో పాటు అతని తమ్ముడు మృత్యువాత పడ్డారు అని చెప్పాలి. అంతేకాదు ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఏడాదిన్నర  చిన్నారి కూడా ఉండడం గమనార్హం. చమరి గ్రామానికి చెందిన హేమేంద్ర మేరవి అంజన గ్రామానికి చెందిన యువతకి రెండు రోజుల క్రితం పెళ్లి జరిగింది.

 అయితే పెళ్లి నాడు బంధుమిత్రులు ఇచ్చిన కానుకలను మరునాడు ఉదయం ఓపెన్ చేశాడు వరుడు. అందులో ఒక హోమ్ థియేటర్ కూడా ఉంది. దీంతో కుటుంబ సభ్యులతో కలిసి హోం థియేటర్కు సెట్ చేసి ఆన్ చేసాడు. అయితే హోమ్ థియేటర్ ఒకసారి గా పేలిపోయింది. పేలుడు దాటికి ఇంటి పై కప్పు ఎగిరిపోయింది. అయితే హోమ్ థియేటర్ లో గన్ పౌడర్ ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు అని చెప్పాలి. ఫోరెన్సిక్  నివేదిక వచ్చిన తర్వాత ఎలా పేలుడు సంభవించింది అన్న విషయంపై స్పష్టత వస్తుందని పోలీసులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: