భార్య మొద్దు నిద్ర.. కేసు పెట్టిన భర్త.. ఎక్కడంటే?

praveen
నిద్ర అనేది మనిషి ఆరోగ్యానికి ఎంతో కీలకమైనది. ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలి అంటే తగినంత సమయం నిద్ర పోవాల్సిందే అన్న విషయం తెలిసిందే. ఈ విషయంలో ఎంతోమంది జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ఉంటారు. కానీ ఇలా ఆరోగ్యానికి మంచి చేసే నిద్ర ఏకంగా భార్యాభర్తల మధ్య గొడవ పెట్టింది అంటే నమ్ముతారా.. నిద్ర గొడవ పెట్టడమేంటి.. ఇదేదో వినడానికే విచిత్రంగా ఉంది అని అంటారు ఎవరైనా.. కానీ ఇక్కడ నిజంగా ఇలాంటిదే జరిగింది.

 భార్య నిద్రమత్తును తట్టుకోలేకపోయిన భార్య నరకయాతన అనుభవించాడు. ఇక సహనం నశించి ఇక నావల్ల కాదు బాబోయ్ అంటూ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. తన భార్య అతిగా నిద్రపోతుంది అంటూ ఫిర్యాదులో పేర్కొన్నాడు భర్త. సదరు వ్యక్తి చేసిన ఫిర్యాదుతో పోలీసులు సైతం షాక్ అయ్యారు అని చెప్పాలి. ఏకంగా తన భార్యపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులను దీనంగా వేడుకున్నాడు సదరు భర్త. ఈ ఘటన బెంగళూరులో వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. ఇంతకీ భర్తకు ఇంతలా విరక్తి రావడం కి కారణం ఏంటి.. భార్య మరీ అంతలా నిద్రపోతుందా అంటారా..
 ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం.. భార్య అయేషా పర్వీన్ రాత్రి భోజనం చేసి నిద్రపోతే మరుసటి రోజు మధ్యాహ్నం 12:30 గంటల వరకు కూడా నిద్రలేవదట. ఇక మధ్యాహ్నం భోజనం చేసి పడుకుంటే మళ్లీ రాత్రి తొమ్మిదిన్నరకు నిద్ర లేస్తుందట. గత ఐదేళ్లుగా కూడా ఇదే తంతు కొనసాగుతుందని భర్త ఇమ్రాన్ ఖాన్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోనే ఏదో ఒకటి చేసి భార్యను మార్చాలి అంటూ బెంగళూరు బసవన్న గుడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇదేంటని ప్రశ్నిస్తే ఆమె కుటుంబ సభ్యులతో దాడి చేయించిందని భర్త షాకింగ్ విషయాలను చెప్పాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ సమస్యను ఎలా సాల్వ్ చేయాలా అనే ఆలోచనలో పడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: