భీమిలి కబడ్డీ జట్టు సీన్ రిపీట్.. కబడ్డీ ఆడుతూ?

praveen
ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా సడన్ హార్ట్ ఎటాకులు అందరిలో భయాందోళనను పెంచుతూ ఉన్నాయి అని చెప్పాలి. ఇలాంటి ఘటనలు చూసిన తర్వాత మనిషి జీవితం ఇంతేనా అని ప్రతి ఒక్కరిలో భావన కలుగుతుంది. ఇక ఇవన్నీ చూసిన తర్వాత మనిషి జీవితం నిజంగానే గ్యారెంటీ లేనిది అని ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది అని చెప్పాలి. ఎందుకంటే అంత సంతోషంగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో కేవలం క్షణాల వ్యవధిలో ఉన్నచోటే కుప్పకూలిపోయి ప్రాణాలు వదులుతున్నారు ఎంతోమంది.

 ఆరోగ్యం కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకునే డాక్టర్ల దగ్గర నుంచి ఇక ఎప్పుడూ ఫిట్నెస్ను కాపాడుకునే క్రీడాకారుల వరకు కూడా అందరికీ ఇదే పరిస్థితి వస్తుంది. ఇక మరి కొంతమంది సామాన్యులు సైతం ఇక ఇలా ప్రాణాలు కోల్పోతూ ఉండడం జరుగుతుంది. దీంతో ప్రతి ఒక్కరికి ప్రాణాలపై మరింత తీపి పెరిగిపోతోంది అని చెప్పాలి. ముఖ్యంగా ఇంకా పాతికేళ్లు కూడా నిండని యువకులు ఇటీవల కాలంలో ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు తరచూ వెలుగుచూస్తున్నాయి. ఇటీవల అనంతపురం పట్టణంలో కూడా ఇలాంటి ఘటన వెలుగు చూసింది.

 19 ఏళ్ల యువకుడు కబడ్డీ ఆడుతూ ప్రాణాలు కోల్పోయాడు. సడన్ హార్ట్ ఎటాక్ తోనే ఇలా ప్రాణాలు గాల్లో కలిసి పోయాయి అని చెప్పాలి. బి ఫార్మసీ చదువుతున్న తనుజ నాయక్ అనే యువకుడు స్నేహితుల తో కలిసి కాలేజీ గ్రౌండ్లో కబడ్డీ ఆడుతూ ఉన్నాడు. భీమిలి కబడ్డీ జట్టు సినిమా లో చివర్లో నాని కుప్ప కూలిపోయి ప్రాణాలు వదిలినట్లు గానే.. ఇక్కడ గ్రౌండ్లో కుప్ప కూలిపోయాడు యువకుడు. వెంటనే బెంగళూరు లోని ఓ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ చివరికి తుది శ్వాస విడిచాడు. ఎంతో ఆరోగ్యంగా ఉండే తమ కుమారుడికి గుండెపోటు రావడం ఏంటి అని అటు తల్లిదండ్రులు కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: