అతడి భార్య ఇతడితో.. ఇతడి భార్య అతనితో.. ఛీ ఛీ?

praveen
పెళ్లంటే ఒక నమ్మకం.. ఇక భార్య అంటే ప్రేమకు చిరునామా.. భర్త అంటే భరోసా.. ఇక పిల్లలు అంటే మోయాలనిపించే ఇష్టమైన బరువు. ఇవన్నీ సినిమాలో డైలాగులు ఇవన్నీ విన్నప్పుడు అబ్బో పెళ్లి చేసుకుంటే ఇంత అందమైన జీవితం ఉంటుందా అని యువతి యువకులు అందరూ కూడా పగటి కలలోకి వెళ్ళిపోతూ ఉంటారు.. కానీ ఆ తర్వాత నిజ జీవితంలో వెలుగులోకి వచ్చే ఘటనలు తెలుసుకున్న తర్వాత మాత్రం పెళ్లి చేసుకున్న తర్వాత జీవితం ఇంత నరకప్రాయంగా ఉంటుందా అని భయపడిపోతూ ఉంటారు అని చెప్పాలి.

 కాలానుగుణంగా ప్రస్తుతం మనిషి జీవనశైలిలో ఎన్నో మార్పులు వస్తూ ఉన్నాయి అని చెప్పాలి. అయితే ఈ మార్పులు అటు దాంపత్య బంధం లో కూడా మరింత ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఒకసారి మూడుముళ్ల బంధం లో అడుగుపెట్టిన తర్వాత కష్టాలు ఉన్న నష్టాలు ఉన్న ఇక అత్తారింట్లో భర్తతోనే ఉండేది భార్య. కానీ ఇప్పుడు చిన్న చిన్న కారణాలకే విడిపోతున్నారు.  ఇక అంతటితో ఆగకుండా కొంతమంది కట్టుకున్న వారికి కల్లు కప్పి ఇతరులతో అక్రమ సంబంధాన్ని పెట్టుకుంటూ ఉన్నారు అని చెప్పాలి. ఇక్కడ అయితే ఇప్పుడు వరకు కనీ విని ఎరుగని ఘటన జరిగింది అని చెప్పాలి.

 ఒక వ్యక్తి భార్య ఏకంగా పరాయి వ్యక్తితో సంబంధం పెట్టుకొని అతడితో వెళ్లిపోవడం గురించి ఇప్పటివరకు విన్నాం. కానీ ఇక్కడ మాత్రం అతడి భార్యను ఇతడు... ఇతడి భార్యను అతడు తీసుకొని వెళ్ళిపోయారు. వినడానికే విచిత్రంగా ఉన్న ఈ ఘటన బీహార్ లో హారతియా గ్రామంలో వెలుగులోకి వచ్చింది. 14 ఏళ్ల క్రితం రూబి దేవి అనే మహిళతో నీరజ్ కుమార్కు వివాహం జరిగింది. వారికి నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. రూబీకి పెళ్లికి ముందే ముఖేష్ కుమార్ అనే వ్యక్తితో ప్రేమలో ఉంది. పెళ్ళైన తర్వాత ప్రేమను కొనసాగించింది. ముఖేష్ కూడా రూబి అన్న పేరు గల యువతీతోనే కొన్నాళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. కాగా గత ఏడాది ఫిబ్రవరిన నీరజ్ భార్య రూబీ తన ప్రియుడు ముఖేష్ తో కలిసి పారిపోయింది. అయితే ఇటు భార్యను అటు భర్తను పోగొట్టుకున్న నీరజ్, ముఖేష్ భార్య రూబీల మధ్య పరిచయం ఏర్పడగా.. ఇక వీరిద్దరూ సహజీవనం చేయడం మొదలుపెట్టారు. ఈ ఘటన గురించి తెలుసుకుని అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: